వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ భేటీతో జగన్ జోష్: చంద్రబాబుతో దోస్తి ఖతం?

ప్రధానమంత్రి నరేంద్రమోడీతో వైఎస్ఆర్ సిపీ అధినేత జగన్ సమావేశం కావడం ఆ పార్టీవర్గాల్లో పుల్ జోష్ ను నింపింది.అయితే ఈ అంశాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకొంటోంది వైసీపీ. అదే సమయంలో టిడిపి నాయకత్వం మా

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్రమోడీతో వైఎస్ఆర్ సిపీ అధినేత జగన్ సమావేశం కావడం ఆ పార్టీవర్గాల్లో పుల్ జోష్ ను నింపింది.అయితే ఈ అంశాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకొంటోంది వైసీపీ. అదే సమయంలో టిడిపి నాయకత్వం మాత్రం జగన్ ప్రధానమంత్రితో సమావేశం కావడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ బిజెపికి దగ్గరౌతోందనే సంకేతాలను ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశం సందర్భంగా ఆ పార్టీ నాయకత్వం ఇచ్చినట్టు కన్పిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్ డి ఏ కు పూర్తిబలం ఉంది. ఈ సమయంలో ఎన్ డి ఏ కు వ్యతిరేకంగా అభ్యర్థిని బరిలోకి దింపకూడదనే అభిప్రాయాన్ని వైసీపీ అధినేత జగన్ వ్యక్తం చేశారు.అయితే జగన్ తమ వైపుకు వస్తారని భావించిన ఎన్ డి ఏ వ్యతిరేకపార్టీలకు జగన్ వైఖరి కొంత ఇబ్బందిని కల్గిస్తోంది.

అయితే అదే సమయంలో రాష్ట్రపతి ఎన్నికలను పురస్కరించుకొని తమకు ప్రధానమంత్రితో అపాయింట్ మెంట్ ఖరారైందనే ప్రచారాన్ని వైసీపీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. ఏదేమైనా వైసీపీ అధినేత జగన్ ప్రధానమంత్రి మోడీ సమావేశం కావడం వైసీపీ క్యాడర్ లో జోష్ కు కారణంగా కన్పిస్తోంది.

జగన్ శిబిరంలో జోష్

జగన్ శిబిరంలో జోష్

ప్రధానమంత్రి నరేంద్రమోడీతో వైసీపీ అధినేత జగన్ సమావేశం కావడం ఆ పార్టీ వర్గాల్లో జోష్ ను నింపింది. ప్రధానమంత్రి మోడీ అపాయింట్ మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ గతంలో మోడీ అపాయింట్ మెంట్ వైసీపి అధినేతకు దక్కలేదు.


బడ్జెట్ సమావేశాల సందర్భంగా మోడీ అపాయింట్ మెంట్ కోసం వైసీపీ ప్రయత్నించింది.అయితే ఆ సమయంలో ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి మినహా ఇతరకుల మోడీ అపాయింట్ మెంట్ దక్కలేదు.అయితే హఠాత్తుగా మోడీ నుండి వైసీపీవర్గాలకు అపాయింట్ మెంట్ దక్కడం ఆ పార్టీవర్గాల్లో సంతోషానికి కారణంగా మారింది.

జగన్ పై వ్యతిరేకత లేదు

జగన్ పై వ్యతిరేకత లేదు

ప్రధానమంత్రి నరేంద్రమోడీకి చంద్రబాబునాయుడుపై ప్రేమ ఉందో లేదా మాకు తెలియదు. కానీ, మేమంటే మాత్రం వ్యతిరేకత లేదని స్పష్టమైందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.


మా పార్టీ చీఫ్ జగన్ ను చూసిన వెంటనే మోడీ జగన్ పేరుపెట్టి మరీ పిలిచారని వైసీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పించడం వంటి పరిణామాలపై మోడీకి ఫిర్యాదు చేసేందుకు గతంలో వైసీపీ ప్రయత్నించింది.అయితే ఆ సమయంలో మోడీ అపాయింట్ మెంట్ మాత్రం వైసీపీకి దక్కలేదు.మరో వైపు తమ పార్టీపైనా, తమ అధినేత జగన్ పై మోడీకి వ్యతిరేకత లేదనే విషయం స్పష్టమైందని వైసీపీ వర్గాలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వడంలో ఉద్దేశ్యమేమిటీ?

మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వడంలో ఉద్దేశ్యమేమిటీ?

రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలోనే వైసీపీ అధినేత జగన్ తో మోడీ సమావేశమయ్యారనే ప్రచారం కూడ ఉంది.అయితే ఈ ప్రచారాన్ని వైసీపీ ఖండించింది. రాష్ట్రపతి ఎన్నికలను పురస్కరించుకొని మోడీ తనకు అపాయింట్ మెంట్ ఇచ్చారని అనుకోవడం లేదన్నారు.

మోడీ అపాయింట్ మెంట్ కోసం చాలాకాలంగా చూస్తున్నట్టు చెప్పారు.అయితే మంగళవారంనాడు రాత్రి తనకు ఫోన్ చేసి అపాయింట్ మెంట్ ను ఫిక్స్ చేసిన విషయాన్ని వైసీపీ అధినేత జగన్ చెప్పారు.రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా తనకు మోడీ అపాయింట్ మెంట్ ఇచ్చారనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు జగన్.

ఎన్ డి ఏ కు బలముంది పోటీ సరికాదు

ఎన్ డి ఏ కు బలముంది పోటీ సరికాదు

ఎన్ డి ఏ కు బలముంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఇతర పార్టీలు రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని పోటీపెట్టడం వల్ల ప్రయోజనం ఏమిటని వైసీపీ అధినేత ప్రధానమంత్రి మోడీని కలిసివచ్చిన తర్వాత ప్రకటించడం విశేషం.అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్ డి ఏ కు వ్యతిరేకంగా రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని బరిలో నిలుపుతోంది.

అయితే ఈ తరుణంలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతిస్తారా అని ప్రశ్నించిన సమయంలో కాంగ్రెస్ పార్టీపై జగన్ తన వ్యతిరేకతను మరోసారి ప్రకటించారు. తనను జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీకి తాను ఎలా మద్దతిస్తానని ఆయన ప్రకటించారు. అయితే మోడీతో సమావేశం తర్వాత జగన్ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం రాజకీయవర్గాల్లో ఉత్సుకతను కారణమైంది. జగన్ బిజెపికి దగ్గరయ్యారనే సంకేతాలను ఇచ్చినట్టు కన్పిస్తోందని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నాడు బాబు, నేడు జగన్

నాడు బాబు, నేడు జగన్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రంలో చోటుచేసుకొన్న అవినీతిపై రాజా ఆఫ్ కరప్షన్ అనే పుస్తకాన్ని టిడిపి రాసింది. ఈ పుస్తకాన్ని రాష్ట్రపతి, ప్రధానమంత్రితో పాటు వివిధ జాతీయపార్టీల నాయకులకు కూడ ఈ పుస్తకాన్ని అందించారు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు.

అయితే అదే సమయంలో వైఎస్ చేసిన అవినీతిపై ఆనాటి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే శంకర్ రావు దాఖలుచేసిన పిటిషన్ పై టిడిపి నాయకులు ఎర్రన్నాయుడు తదితరులు ఇంప్లీడ్ అయ్యారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అనే పుస్తకాన్ని వైసీపీ అధినేత జగన్ ప్రధానమంత్రి మోడీకి వివరించారు.

English summary
Ysrcp leaders happy for primeminister appointment to Jagan.Jagan explained situation in the Andhrapradesh state said party leaders.He given a book about Chandrababunaidu's corruption to Modi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X