విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌పై కేసు పెట్టారుగా, చంద్రబాబు వల్లే: టిడిపి నేతల వీరంగంపై వైసిపి

రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అండతోనే అధికారులపై దాడులు జరుగుతున్నాయని వైసిపి నేతలు పార్థసారథి, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు ఆదివారం ఆరోపించారు. విజయవాడ రవాణా సాఖ కార్యాలయంలో టిడిపి ఎంపి కేశినేని నాని

|
Google Oneindia TeluguNews

విజయవాడ: రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అండతోనే అధికారులపై దాడులు జరుగుతున్నాయని వైసిపి నేతలు పార్థసారథి, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు ఆదివారం ఆరోపించారు. విజయవాడ రవాణా సాఖ కార్యాలయంలో టిడిపి ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమలు వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే.

దీనిపై వైసిపి నేతలు మాట్లాడారు. ప్రభుత్వ అధికారులపై దాడిచేస్తే వారు టిడిపి నేతలపై ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. నందిగామ బస్సు ప్రమాదం ఘటనలో ప్రజాసమస్యపై అధికారులను నిలదీస్తే జగన్‌పై కేసు పెట్టారన్నారు.

చంద్రబాబు సీరియస్... నా బస్సులు ఆపేస్తా, సారీ చెప్తున్నా: కేశినేని, ఉమ,చంద్రబాబు సీరియస్... నా బస్సులు ఆపేస్తా, సారీ చెప్తున్నా: కేశినేని, ఉమ,

రాష్ట్రంలో ప్రయివేటు బస్సులు నిబంధనలు పాటించడం లేదని టిడిపి ఎంపీనే ఆరోపిస్తున్నారని వ్యాఖ్యానించారు. టిడిపి ఎంపీ ఆరోపణలపై స్పందించాలన్నారు. నోరు తెరిస్తే చాలా వాస్తవాలు చెప్పాల్సివస్తుందన్న కమిషనర్ ఎవరి ఒత్తిళ్లకు తగ్గి మౌనంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

YSRCP leaders targets Chandrababu for Vijayawada issue

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అధికారులపై దాడి చేసిన టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో టిడిపికి ఓ విధానం, ప్రతిపక్షానికి మరో విధానం కొనసాగుతుందన్నారు.

ఎయిర్ పోర్టులో జేసీ దివాకర్ రెడ్డి వీరంగం సృష్టిస్తే కేసు పెట్టలేదన్నారు. రాష్ట్రంలో ఇన్ని వందల అక్రమ బస్సులు ఎలా తిరుగుతున్నాయో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు.

చంద్రబాబు ఉద్యోగ సంఘాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి విమరశించారు. ఎమ్మార్వో వనజాక్షి, టూరిజం సిబ్బందిపై దాడి ఘటనలో చర్యలు ఏవో చెప్పాలన్నారు. దాడికి పాల్పడిన కేశినేని, ఉమలపై చర్యలు తీసుకోవాలన్నారు.

English summary
YSR Congress Party leaders targets AP CM Chandrababu Naidu for Vijayawada issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X