నంద్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాంధేయవాదాన్నే నమ్ముకొన్నా, నన్ను కాల్చి చంపండి: ఆదినారాయణరెడ్డి

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల: దళితుల గురించి తాను తప్పుగా మాట్లాడినట్టు ఉంటే కాల్చి చంపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి కోరారు. వైసీపీ తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని చెప్పారు.

ఆదినారాయణుడ్డి దళితులను కించపర్చే విధంగా మాట్లాడారని వైసీపీ ఆరోపణలు చేస్తోంది.ఈ ఆరోపణలతో టిడిపి ఇరుకున పడింది. నంద్యాల ఉప ఎన్నికల్లో ఈ ప్రభావం పడకుండా ఉండేందుకుగాను తెలుగుదేశం పార్టీ నష్టనివారణ చర్యలను పూనుకొంది.

నంద్యాల అసెంబ్లీ స్థానంలోని గోస్పాడు మండలానికి మంత్రి ఆదినారాయణరెడ్డి టిడిపి ఎన్నికల ఇంచార్జీగా కొనసాగుతున్నారు. అయితే అదే సమయంలో ఈ ఆరోపణలు మంత్రి ఆదిని చుట్టుముట్టడంతో ఆయన తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

ఎన్నికల వేళ ఈ ఆరోపణలు రావడం, నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్‌లో కీలకమైన గోస్పాడు మండలానికి ఇంచార్జీగా ఉన్న ఆదినారాయణరెడ్డి ఈ విషయమై వివరణ ఇచ్చారు. నంద్యాలలో మంగళవారం రాత్రి మంత్రి ఆదినారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. కడప జిల్లాలో తాను దళితులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.

కాల్చి చంపాలని కోరిన మంత్రి ఆదినారాయణరెడ్డి

కాల్చి చంపాలని కోరిన మంత్రి ఆదినారాయణరెడ్డి

దళితుల గురించి తప్పుగా తాను మాట్లాడినట్టు తేలితే కాల్చి చంపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి కోరారు. దళితులను కించపర్చేలా తాను వ్యాఖ్యలు చేసినట్టుగా ఓ మీడియా ప్రసారం చేయడం పై ఆయన స్పందించారు. తాను తప్పు చేయలేదన్నారు. వైసీపీ చీఫ్ జగన్ కక్షతోనే తనపై ఈ ప్రచారం చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు.

Recommended Video

Mahesh fans Support To YSRCP in Nandyal By polls, What About Pawan Kalyan | Oneindia Telugu
కులమంటే శుభ్రత, మతమంటే మానవత

కులమంటే శుభ్రత, మతమంటే మానవత

కులమంటే శుభ్రత, మతమంటే మానవత అనేది తన సిద్దామని మంత్రి ఆదినారాయణరెడ్డి చెప్పారు. మానవులంతా ఒక్కటేనని తాను నమ్ముతానని చెప్పారు. దళితులను కించపర్చేలా తాను ఏనాడూ కూడ మాట్లాడలేదని చెప్పారు. దళితుల ఇళ్ళ మద్యే తన ఇళ్ళు కూడ ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

నంద్యాలలో కీలకపాత్ర పోషిస్తున్నందునే...

నంద్యాలలో కీలకపాత్ర పోషిస్తున్నందునే...

నంద్యాల ఉప ఎన్నికల్లో తాను కీలకంగా వ్యవహరిస్తున్నందునే వైసీపీ తనను లక్ష్యంగా చేసుకొందని ఆయన ఆరోపణలు చేశారు. వైసీపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా కానీ తనకు నష్టం లేదన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కోనేశక్తి లేకనే వైసీపీ ఈ రకంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపణలు చేశారు.

గాంధారీ వ్యవస్థ, గాంధీ వ్యవస్థకు మధ్య పోటీ

గాంధారీ వ్యవస్థ, గాంధీ వ్యవస్థకు మధ్య పోటీ

నంద్యాలలో జరుగుతున్న పోటీ అభివృద్దికి, అవరోధానికి మధ్య జరుగుతోందన్నారు. ఈ పోటీలో తమ అభ్యర్థి గెలుపు తథ్యమన్నారు ఆదినారాయణరెడ్డి.జమ్మలమడుగు నియోజకవర్గంలో టిటిడి నిధులతో 18 చోట్ల దళిత కాలనీల్లో దేవాలయాలను నిర్మించినట్టు ఆయన చెప్పారు. గాంధారి వ్యవస్థకు , గాంధీ వ్యవస్థకు జరుగుతున్న పోటీలో గాంధేయవాదాన్ని నమ్ముకొన్న తాము విజయం సాధిస్తామని ఆదినారాయణరెడ్డి చెప్పారు.

English summary
I never criticised s.c's said Ap minister Adinarayana reddy.He spoke to media on Tuesday night in Nandyal. Ysrcp made wrong allegations on me said minister Adinarayanareddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X