కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'పులివెందులలో జగన్‌పై గంటాను పోటీకి నిలబెడదామా', బాబుపై వైసిపి హక్కుల నోటీసు!

కర్నూలు, ఎస్పీఎస్ నెల్లూరులతో పాటు వైయస్ జగన్ ఇలాగా కడపలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి గెలవడంతో ఆ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సంతోషంగా ఉన్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: కర్నూలు, ఎస్పీఎస్ నెల్లూరులతో పాటు వైయస్ జగన్ ఇలాగా కడపలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి గెలవడంతో ఆ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సంతోషంగా ఉన్నారు.

'ఏం లాభం... బాబాయ్‌ని గెలిపించుకోలేకపోయారు', 'జగన్ అతి వల్లే''ఏం లాభం... బాబాయ్‌ని గెలిపించుకోలేకపోయారు', 'జగన్ అతి వల్లే'

మంత్రి గంటా శ్రీనివాస రావు వ్యూహం, ఎత్తుగడల కారణంగా కడపలో టిడిపి విజయం సాధించిందని చంద్రబాబు మంత్రుల వద్ద ప్రశంసించారు. అదే సమయంలో జగన్ చేసిన సవాల్ చర్చకు వచ్చిందని తెలుస్తోంది.

కడప ఎన్నికల్లో అధికార పార్టీ పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారని, తన ఇలాకాలో టిడిపికి బలమే ఉంటే తదుపరి ఎన్నికల్లో కడప నుంచి చంద్రబాబు పోటీ చేయాలని సవాల్ చేశారు.

దీనిపై చంద్రబాబు, మంత్రుల మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మంత్రులతో ముచ్చటిస్తూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పైన మంత్రి గంటా శ్రీనివాస్ రావును దింపితే.. అని అన్నారని తెలుస్తోంది.

మంత్రి పుల్లారావు మాట్లాడుతూ.. విశాఖలో విజయమ్మను ఓడించారని, కడపలో వైయస్ వివేకాను ఓడించారని, ఈసారి ఎన్నికల్లో పులివెందులలో గంటాను పోటీకి నిలబెడదామని అన్నారు. అయితే ఇప్పుడే ప్రకటిద్దామని చంద్రబాబు అన్నారు. దీంతో అక్కడున్న వారంతా నవ్వేశారు.

chandrababu naidu - ys jagan

చంద్రబాబుపై హక్కుల నోటీసు ఇచ్చేందుకు వైసిపి..

ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి అలగా జనం అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని వైసిపి నిర్ణయించింది.

కడపలో జగన్‌కు ఊహించని షాక్: సీనియర్లు దూరం కావడమూ కారణమే!కడపలో జగన్‌కు ఊహించని షాక్: సీనియర్లు దూరం కావడమూ కారణమే!

చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో తమ హక్కులకు భంగం వాటిల్లిందని, అందుకే ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని నిర్ణయించామన్నారు.

ఈ నేపథ్యంలో వైసిపికి చెందిన ఎస్సీ, ఎస్టీ మొదలైన ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన నోటీసును అసెంబ్లీ స్పీకర్‌కు మంగళవారం సమర్పించనున్నట్లు తెలుస్తోంది. కాగా, గవర్నర్ ప్రసంగంపై అసెంబ్లీలో ఈ రోజు చంద్రబాబు సమాధానమిస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి 'అలగాజనం' అని వ్యాఖ్యానించారు.

English summary
YSRCP may give privilege notice against Andhra Pradesh Chief Minister Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X