కుట్రలు, కుతంత్రాలు చేసినా న్యాయమే గెలిచింది: శిల్పా మోహన్‌రెడ్డి

Posted By:
Subscribe to Oneindia Telugu

నంద్యాల: నంద్యాలలో న్యాయం గెలిచిందని వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి చెప్పారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా న్యాయమే గెలిచిందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

చదవండి :రెండు గంటల ఉత్కంఠకు తెర: భూమా, శిల్పా నామినేషన్లు సక్రమమే

నామినేషన్ సక్రమేనని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించిన తర్వాత ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుట్రలను ప్రోత్సహిస్తున్నారని శిల్పా మోహన్‌రెడ్డి ఆరోపించారు.

silpamohan reddy

పోలింగ్‌బూత్‌లవారీగా మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకుగాను కోట్ల రూపాయాలను అధికారపార్టీ కుమ్మరిస్తోందని ఆయన ఆరోపించారు.

శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్ ఆమోదంపై వైసీపీ నేతలు శిల్పా చక్రపాణిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డిలు టిడిపిపై విరుచుకుపడ్డారు. నంద్యాలలో టిడిపికి ఓటమి భయం పట్టుకొందని వారు ఆరోపించారు.

టిడిపి ఎన్ని కుట్రలు పన్నినా వైసీపీదే విజయమని చెప్పారు. వైసీపీని వీడి 21 మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు. అయితే వారితో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.

Bhuma Nagi Reddy's Loss Because Of Chandrababu Naidu : G. Karunakar Reddy - Oneindia Telugu

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ysrcp Nandyal candidate Silpa Mohan reddy made allegations on Ap chief minister Chandrababunaidu on Monday.He spoke to media after nomination accepted.
Please Wait while comments are loading...