వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"నా ఆస్తులు అవే.. నాకు లేని బలం ఏంటంటే?; బాబు దోపిడీ లెక్క ఇది"

నంద్యాల ఉపఎన్నిక కోసం వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా కష్టపడుతున్నారు. ప్రచార బాధ్యతలను స్వయంగా తానే భుజాన వేసుకుని నంద్యాల ప్రజల ముందుకు వెళ్తున్నారు. ప్రచార పర్వం ముగిసేంతవరకు నంద్యాలలోనే ఉండనున్న ఆయన..

|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ఉపఎన్నిక కోసం వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా కష్టపడుతున్నారు. ప్రచార బాధ్యతలను స్వయంగా తానే భుజాన వేసుకుని నంద్యాల ప్రజల ముందుకు వెళ్తున్నారు. ప్రచార పర్వం ముగిసేంతవరకు నంద్యాలలోనే ఉండనున్న ఆయన.. గెలుపే లక్ష్యంగా టీడీపీ వైఫల్యాలను ఎండట్టే పనిలో ఉన్నారు.

వైసీపీకి చిక్కక టీడీపీలోకి: డిసైడ్ చేసేది ముస్లింలే.. ఇదీ నంద్యాల 'రియాలిటీ'?వైసీపీకి చిక్కక టీడీపీలోకి: డిసైడ్ చేసేది ముస్లింలే.. ఇదీ నంద్యాల 'రియాలిటీ'?

ఈ నేపథ్యంలో గురువారం ఆయన చాబ్రోలులో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. టీడీపీని విమర్శిస్తూనే తన బలాబలాల గురించి జనానికి వివరించారు. 'నాన్న గారు ఇచ్చిపోయిన ఇంతపెద్ద కుటుంబమే నాకున్న పెద్ద ఆస్తి.. నాన్న గారు అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రతీ ఇంట్లో సజీవంగా ఉండటమే నాకున్న ఆస్తి.. జగన్ అబద్దాలు ఆడడు.. చెప్పింది కచ్చితంగా చేస్తాడన్న విశ్వసనీయతే నా ఆస్తి' అని చెప్పారు.

నంద్యాల జనానికి దిమ్మతిరిగింది?: 'ఒకప్పుడు భూమా రౌడీ.. ఇప్పుడు గొప్పోడు'నంద్యాల జనానికి దిమ్మతిరిగింది?: 'ఒకప్పుడు భూమా రౌడీ.. ఇప్పుడు గొప్పోడు'

అవినీతి సొమ్మును పంచుతూ:

అవినీతి సొమ్మును పంచుతూ:

నంద్యాలలో వందల కోట్ల అవినీతి సొమ్మును టీడీపీ విచ్చలవిడిగా ఖర్చు చేస్తోందని జగన్ ఆరోపించారు. ఒక్క నంద్యాలలోనే ఈరోజు అభివృద్ధి హడావుడి జరుగుతోందని, మూడేళ్ల పాలనలో ఏ ఒక్క హామిని నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు.

చిన్న చిన్న నేతలను సైతం కొనుగోలు చేస్తున్నారని, ఇవాళ చంద్రబాబు కేబినెట్ మొత్తం నంద్యాల నడిరోడ్డు మీద ఉందని అన్నారు. రాష్ట్రమంతా అవినీతి కావడంతోనే చంద్రబాబుకు ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు.

Recommended Video

Chandrababu Naidu And His son Nara Lokesh Fight Real OR Fake ?
చానెళ్లు, పేపర్లు, పోలీస్ బలం లేదు:

చానెళ్లు, పేపర్లు, పోలీస్ బలం లేదు:

నంద్యాల ఉపఎన్నికలో చంద్రబాబు టేప్ రికార్డర్ మరోసారి ఆన్ చేశారని, చెప్పిందే చెప్పి ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. డబ్బుతో ఏదైనా చేయొచ్చు అన్న భావనతో చంద్రబాబుకు కళ్లు నెత్తి మీదకు వచ్చాయని జగన్ ఎద్దేవా చేశారు.

చంద్రబాబులా తనకు సీఎం పదవి లేదని, పోలీసు బలం లేదని, చానెళ్లు, పేపర్లు తనవద్ద లేవని జగన్ అన్నారు. అయితే చంద్రబాబు లాగా తన వద్ద దుర్బిద్ది మాత్రం లేదన్నారు. వైఎస్ ఇచ్చిన ఇంతపెద్ద కుటుంబమే తన ఆస్తి పేర్కొన్నారు.

ఒక్కొక్కరి నుంచి రూ.60వేలు దోపిడీ:

ఒక్కొక్కరి నుంచి రూ.60వేలు దోపిడీ:

ఉపఎన్నికలు రాగానే మహిళలను మోసం చేయడానికి చంద్రబాబుకు కుట్టుమిషన్లు గుర్తుకొస్తాయని జగన్ విమర్శించారు. రైతులను మోసం చేయడానికి ట్రాక్టర్లు గుర్తుకొస్తాయన్నారు. ఇదంతా దోచిన సొమ్మేనని, అందులో నుంచే కొద్దో గొప్పో ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారని అన్నారు.

మూడున్నరేళ్ల పాలనలో చంద్రబాబు మూడున్నర లక్షల కోట్లు వెనుకేసుకున్నారని జగన్ ారోపించారు. ఆరు కోట్ల మంది ఉన్న రాష్ట్రంలో చంద్రబాబు మూడున్నర లక్షల కోట్లు దోచుకున్నారంటే.. సగటున ఒకరి నుంచి రూ.60వేలు దోచుకున్నట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దోచుకున్నదే పంచుతూ:

దోచుకున్నదే పంచుతూ:

దోచుకున్న సొమ్మునే ఇప్పుడు నంద్యాల ఓటర్లకు రూ.5వేల చొప్పున పంచుతున్నారని జగన్ ఆరోపించారు. రానున్న రోజుల్లో డబ్బు మూటలతో నంద్యాలకు వచ్చే చంద్రబాబు.. చేతిలో డబ్బు పెట్టి, జేబులో నుంచి దేవుడి ఫోటో తీసి, దానిపై ప్రమాణం చేసి తనకే ఓటేయమని చెబుతారని పేర్కొన్నారు. అలాంటి సమయంలో ధర్మం వైపు నిలబడుతామని చెప్పి దుర్నీతిని తిప్పికొట్టాలని అన్నారు.

రైతు రుణమాఫీ కావాలంటే, బ్యాంకుల్లోని బంగారం ఇంటికి రావాలంటే.. బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. జాబు కావాలంటే బాబు రావాలన్నాడు. జాబ్ ఇవ్వని పక్షంలో ఇంటింటికి రెండున్నరవేలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానన్నాడు. కానీ ఏ ఒక్క హామిని చంద్రబాబు నెరవేర్చలేదని జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

English summary
On thursday YSRCP President Jagan participated in Road show in Nandyala regarding bypoll campaign
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X