వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టార్గెట్ చంద్రబాబు.. మేమూ: పవన్ కళ్యాణ్‌తో కలిసేందుకు జగన్ సిద్ధం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో జత కట్టేందుకు సిద్ధమవుతున్నారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో జత కట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే, ప్రత్యేక హోదా కోసం జగన్‌తో కలిసేందుకు సిద్ధమని పవన్ ప్రకటించారు.

<strong>చంద్రబాబుకు షాక్: 8న జగన్ - పవన్ కళ్యాణ్‌ల కలయిక? వారి ప్రయత్నం </strong>చంద్రబాబుకు షాక్: 8న జగన్ - పవన్ కళ్యాణ్‌ల కలయిక? వారి ప్రయత్నం

తాజాగా, వైసిపి నేత విజయ సాయి రెడ్డి జనసేన అధినేతకు సానుకూల సంకేతాలు ఇచ్చారు. తాము కూడా పవన్‌తో జత కట్టేందుకు సై అన్నారు.

తద్వారా, నారా చంద్రబాబు నాయుడిను అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా, 2019లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ స్థాపించిన జనసేన పార్టీతో పొత్తు పెట్టుకునే అంశంపై జగన్ పార్టీ నుంచి సానుకూల సంకేతాలు రావడం గమనార్హం.

YS Jagan - Pawan Kalyan

చంద్రబాబును అడ్డుకునేందుకు జనసేన సహా, సీపీఐ, సీపీఎం తదితర భావ సారూప్యమున్న పార్టీలతో పొత్తుకు సిద్ధమని ఆ పార్టీ నేత, ఎంపీ విజయ సాయి రెడ్డి ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన క్రమంలో తమతో ఎవరు కలిసి వచ్చినా స్వాగతిస్తామన్నారు.

<strong>ఇలా అన్నారు: జగన్‌తో కలిసి పని చేసేందుకు పవన్ కళ్యాణ్ రెడీ</strong>ఇలా అన్నారు: జగన్‌తో కలిసి పని చేసేందుకు పవన్ కళ్యాణ్ రెడీ

హోదా కోసం వారితో కలసి పోరాడేందుకు సిద్ధమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏపీకి తీరని ద్రోహం చేసిందని, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు ఎన్నడూ విశ్వసించే అవకాశం లేదని, అటువంటి ద్రోహం చేసిన పార్టీతో తాము సంబంధాలు పెట్టుకోబోమన్నారు.

బీజేపీతో సంబంధాలకు తాము సిద్ధంగా లేమని, పెట్టుకోవాలంటే గతంలోనే ఆఫర్ వచ్చిందన్నారు. హోదా కోసం పోరాడుతున్న పవన్ కళ్యాణ్ తమతో చేతులు కలిపితే సంతోషమన్నారు. తమ పోరాటాన్ని సమర్థించేవారిని ఎప్పుడైనా స్వాగతిస్తామని, వారితో కలసి పోరాటం చేస్తామన్నారు.

English summary
YSR Congess Party ready to join hands with Jana Sena chief Pawan Kalyan for Special Status issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X