వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు-లోకేష్‌ను తంతారు, నా దెబ్బకు బటన్ నొక్కి..: ఊగిపోయిన జగన్

భూములు ఆక్రమించిన రాక్షసులను మేం అధికారంలోకి వచ్చాక జైలుకు పంపిస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం అన్నారు. సేవ్ విశాఖ పేరుతో విశాఖలో ధర్నా

|
Google Oneindia TeluguNews

విశాఖ: భూములు ఆక్రమించిన రాక్షసులను మేం అధికారంలోకి వచ్చాక జైలుకు పంపిస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం అన్నారు. సేవ్ విశాఖ పేరుతో విశాఖలో ధర్నా నిర్వహించారు.

అయ్యన్న మళ్లీ.. కుంభకోణంపై ఆసక్తికరం.. ఎవరిని విడిచిపెట్టవద్దని! అయ్యన్న మళ్లీ.. కుంభకోణంపై ఆసక్తికరం.. ఎవరిని విడిచిపెట్టవద్దని!

ఈ ధర్నాకు లెఫ్ట్ పార్టీ, లోక్‌సత్తాలు మద్దతు పలికాయి. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. ఎకరాకు రూ.10 లక్షలు ఇస్తే మీ భూములు మీకు ఇస్తామని చెబుతున్నారని, లేదంటే రైతులను కొడుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ భూ స్కాం గురించి సాక్షిలో వచ్చిన వార్తలే కాదని, ఈనాడులో వచ్చిన వార్తలు కూడా చూపిస్తానని జగన్ అన్నారు.

35 మంది ఆక్రమించారు.. ఎమ్మెల్యేల అండదండలు

35 మంది ఆక్రమించారు.. ఎమ్మెల్యేల అండదండలు

నక్కపల్లి మండలం అమలాపురంలో ప్రభుత్వ భూమిని 35మ మంది టిడిపి నేతలు ఆక్రమించారన్నారు. దర్జాగా ఆన్‌లైన్‌లో తమ పేరిట పట్టాలు సృష్టించుకున్నారని ఆరోపించారు. వాళ్లందరికీ ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయన్నారు. వారంతా బినామీలేనని, వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

రికార్డులు సృష్టించి మావే అంటున్నారు

రికార్డులు సృష్టించి మావే అంటున్నారు

మాజీ సైనికుల భూములు కూడా కొట్టేశారన్నారు. పరవాడ మండలం లంకలపాలెంలో 2010 వరకు ప్రభుత్వ భూమిగా ఉన్న భూమి ఆ తర్వాత ప్రయివేటు వ్యక్తుల పరమైందన్నారు. రికార్డులు సృష్టించి తమదే అంటున్నారన్నారు. రెవెన్యూ రికార్డులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు.

గంటా, లోకేష్ పంచుకునే కార్యక్రమం

గంటా, లోకేష్ పంచుకునే కార్యక్రమం

గంటాకు ఇంతా, నారా లోకేష్‌కు ఇంత అని పంచుకునే కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కలెక్టర్ ఇటీవల ఆసక్తికర ప్రకటన చేశారన్నారు. 16వేలకు పైగా ఫీల్డ్ మేనేజ్‌మెంట్ పుస్తకాలు కనిపించడం లేదని చెప్పారని, సర్వే నెంబర్లు ఉండాల్సిన పుస్తకాలు కనిపించకపోవడం ఏమిటన్నారు. విశాఖలో జరిగిన కుంభకోణం మామూలుది కాదని జగన్ ఆరోపించారు.

ముఖ్యమంత్రి నుంచి అధికారుల వరకు కుమ్మక్కు

ముఖ్యమంత్రి నుంచి అధికారుల వరకు కుమ్మక్కు

ముఖ్యమంత్రి నుంచి అధికారుల వరకూ అందరూ కుమ్మక్కయ్యారని తీవ్ర ఆరోపణలు చేశారు. అందరూ కలిసి మాఫియాగా మారారని చెప్పారు. భూములు దోచుకు తింటున్నారన్నారు. పేదలకు నాడు ప్రభుత్వం భూములు ఇచ్చిందని, ఇప్పుడు కాజేసేందుకు స్కెచ్ వేసిందన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో పేదలను బెదిరించారన్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో జీవో జారీ చేశారన్నారు. పేదలు, అసైన్డ్ భూములు ల్యాండ్ పూలింగ్ చేస్తారా అని నిలదీశారు.

ఏడాది తర్వాత..

ఏడాది తర్వాత..

ఏడాది ఓపిక పట్టాలని, అధికారంలోకి వస్తామని జగన్ అన్నారు. మనం అధికారంలోకి వస్తే అంగుళం భూమి కూడా వదిలి పెట్టకుండా ఎవరివి వాళ్లకు అప్పగిస్తామని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు దోపిడీకి తెరలేపారన్నారు. ఎక్కడ పేదలు ఉంటారో అక్కడే చంద్రబాబు కన్నేస్తారని ధ్వజమెత్తారు. అన్యాయాన్ని ఎత్తి చూపేందుకే ఈ మహాధర్నా అన్నారు. ఈ మహాధర్నాతో అయినా చంద్రబాబుకు బుద్ధి రావాలన్నారు.

జైలుకు పంపిస్తాం..

జైలుకు పంపిస్తాం..

జేపీ అగ్రహారంలో రైతుల భూములు కొల్లగొట్టి రికార్డులు తారుమారు చేశారని జగన్ ఆరోపించారు. పేద రైతులను బెదరగొట్టి భూములు తీసుకున్నారన్నారు. ల్యాండ్ పూలింగ్ కింద మీ భూములు ఉన్నాయని చెప్పి భయపెట్టారన్నారు. భయపడని రైతుల భూముల్లో రాత్రికి రాత్రే రోడ్లు వేశారన్నారు. అదేమిటని అడిగితే ఈ భూములు మావేనని చెప్పారన్నారు. జేపీ అగ్రహారం రైతులకు అండగా ఉంటామని చెప్పారు. మేం అధికారంలోకి వచ్చాక ప్రతి అంగుళం తిరిగి ఇస్తామన్నారు. భూములు ఆక్రమించిన రాక్షసులను జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ముదపాకలోను భూములు కొట్టేసే ప్లాన్ చేశారన్నారు.

జగన్ వస్తున్నాడంటే ఓ బటన్..

జగన్ వస్తున్నాడంటే ఓ బటన్..

తాను వస్తున్నానని తెలిసి, రికార్డులు మళ్లీ సరి చేశారని జగన్ అన్నారు. జగన్ వస్తున్నాడంటే ఓ బటన్ నొక్కుతున్నారని, రాలేదంటే మరో బటన్ నొక్కుతున్నారని చెప్పారు. అంటే బటన్ నొక్కేంత సులభంగా పని చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి దగ్గరుండి భూములు తీసుకునే ప్రయత్నాలు చేశారన్నారు. నాకు ఇంత, లోకేష్‌కు ఇంత అని ఆయన మాట్లాడుకుంటున్నారని ఆరోపించారు. ఇలా చేస్తున్న మీరు అసలు మనుషులేనా అన్నారు. కొన్ని భూముల పక్కనే ఎంపీ భూములు ఉన్నావని, వాటిన మాత్రం ముట్టుకోరన్నారు. తమ భూమి ఎక్కడ లాక్కుంటుందోనని ప్రతి పేదవాడు భయపడి బతికే పరిస్థితి కనిపిస్తోందన్నారు.

చంద్రబాబు, లోకేష్‌ను తంతారు

చంద్రబాబు, లోకేష్‌ను తంతారు

రూపాయి పెట్టుబడి పెట్టి కోట్లు కొల్లగొట్టాలని అధికార పార్టీ నేతలు చూస్తున్నారని మండిపడ్డారు. విశాఖ భూకుంభకోణంపై సిఐడి విచారణపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీతమ్మను ఎత్తుకు పోవడం కరెక్టా, తప్పా అని కుంభకర్ణుడితో విచారణ వేయిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చంద్రబాబు వేయించిన విచారణ అలాంటిదన్నారు. అదే హనుమంతుడితో వేయిస్తే రావణాసురుడిని, రాక్షసులను తంతాడన్నారు. అందుకే తాము సిబిఐ విచారణ కోరుతున్నామన్నారు. కానీ సిబిఐకి ఇస్తే 20 ఏళ్లు పడుతుందని చంద్రబాబు చెబుతున్నారని, కానీ సిబిఐకి ఇస్తే అన్నేళ్లు పడుతుందని భయమా లేక ఇరవై ఏళ్లు మీరు జైలుకు వెళ్తారనే భయమా అని నిలదీశారు. సిబిఐకి ఇస్తే ఈ కేసులో చంద్రబాబును తంతారని, ఆయన కొడుకును తంతారని జగన్ అన్నారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy on Thursday participated in Save Vishaka dharna and lashed out at TDP government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X