విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎదురుదెబ్బ: వైసీకీ ఓటేసిన టీడీపీ కౌన్సిలర్, చేజారిన పెడన ఛైర్మన్ పదవి

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు అధికార పార్టీ టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సరైన వ్యాహం లేక పెడన మున్సిపల్ చైర్మన్ పదవిని అధికార పార్టీ చేజార్చుకుంది. దీంతో ఒక్క ఓటు తేడాతో పెడన మున్సిపల్ చైర్మన్ పదవిని వైసీపీ సొంతం చేసుకుంది.

వివరాల్లోకి వెళితే... పెడన మున్సిపాలిటీకి గతంలో జరిగిన ఎన్నికల్లో 11 మంది కౌన్సిలర్లు వైసీపీ, మరో 11 మంది కౌన్సిలర్లు టీడీపీ తరపున ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మున్సిపల్ ఛైర్మన్ ఆకస్మిక మరణంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి.

ysrcp shock too tdp over pedana municipal council elections

ఈ నేపథ్యంలో గురువారం పెడన మున్సిపల్ చైర్మన్ పదవికి ఎన్నికలు జరిగాయి. వైసీపీ అభ్యర్ధికి టీడీపీ కౌన్సిలర్ స్రవంతి ఓటు వేశారు. దీంతో ఒక్క ఓటు తేడాతో వైసీప అభ్యర్ధి బండారు ఆనంద్ ఛైర్మన్‌‌గా ఎన్నికయ్యారు. ఎక్స్ అఫిషియో సభ్యుడుగా స్థానిక ఎమ్మెల్యే కాగిత వెంకటరావు ఉన్నారు. అలాగే పెడన మండల పరిషత్ పీఠం కూడా వైసీపీకే దక్కింది.

ఇక్కడ కూడా వైసీపీకే స్పష్టమైన ఆధిక్యం వచ్చింది. మొత్తం తొమ్మిది ఎంపీటీసీ స్థానాలలో ఐదు వైసీపీ ఖాతాలో ఉండగా, టీడీపీకి నలుగురే ఉన్నారు. దాంతో వైసీపీకి చెందిన అచ్యుతరాజు నేరుగా ఎన్నికయ్యారు. అయితే మంత్రి, స్థానిక ఎమ్మెల్యే మధ్య ఉన్న విభేదాలే ఈ ఓటమికి కారణమని టీడీపీ తమ్మళ్లు అంటున్నారు.

English summary
ysrcp shock too tdp over pedana municipal council elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X