వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధాని జిల్లాలో జగన్ సీక్రెట్ సర్వే, వారికే సీట్లు: ముగ్గురు మారే ఛాన్స్

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండేలా ఏపీలోని ఆయా పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇందులో భాగంగా ప్రతిపక్ష వైసిపి అధినేత జగన్ గెలిచే అభ్యర్థులపై రహస్య సర్వే చేయిస్తున్న విషయం తెలిసిందే.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండేలా ఏపీలోని ఆయా పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇందులో భాగంగా ప్రతిపక్ష వైసిపి అధినేత జగన్ గెలిచే అభ్యర్థులపై రహస్య సర్వే చేయిస్తున్న విషయం తెలిసిందే.

<strong>మాకే తగిలింది: జగన్ తీరుపై సొంత పార్టీలో అసంతృప్తి!, ఆంధ్రజ్యోతిపై ఎలా..</strong>మాకే తగిలింది: జగన్ తీరుపై సొంత పార్టీలో అసంతృప్తి!, ఆంధ్రజ్యోతిపై ఎలా..

ఈ సర్వేలో గుంటూరు జిల్లాలో తొమ్మిది స్థానాల్లో ఇంచార్జులకు టిక్కెట్లు ఇవ్వాలని తేలిందని తెలుస్తోంది. అలాగే మూడు స్థానాల్లో అభ్యర్థులను మార్చే అవకాశముందని అంటున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అభ్యర్థులు తారుమారయ్యే అవకాశముందంటున్నారు.

సర్వేలే మూడు అంశాలు ప్రధానంగా

సర్వేలే మూడు అంశాలు ప్రధానంగా

వైసిపి ఈ సర్వేలో ప్రధానంగా మూడు అంశాలను పరిగణలోకి తీసుకుందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో 17 స్థానాలకు గాను అయిదు స్థానాల్లో వైసిపి గెలిచింది. పోటీ చేసి ఓడిన నేతలను నియోజకవర్గ ఇంచార్జులుగా ఉన్నారు.

పలువుర నియోజకవర్గాల ఇంచార్జుల మార్పు

పలువుర నియోజకవర్గాల ఇంచార్జుల మార్పు

ఎన్నికల తర్వాత పార్టీ సమీకరణాల నేపథ్యంలో పెదకూరపాడు నియోజకవర్గానికి యువ నేత మనోహర్ నాయుడు, గురజాలకు కాసు మహేష్ రెడ్డిని కొత్తగా ఇంచార్జులుగా నియమించారు. ఈసారి విజయావకాశాలు ఉన్న వారికే టిక్కెట్లు ఇవ్వాలని భావిస్తున్నారు.

ప్రస్తుత ఎమ్మెల్యేలు వీరే

ప్రస్తుత ఎమ్మెల్యేలు వీరే

ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కోన రఘుపతి, ముస్తఫా, ఆళ్ల రామకృష్ణా రెడ్డిలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీరు సిట్టింగ్ స్థానాల నుంచే మళ్లీ పోటీ చేయనున్నారు.

ప్రస్తుత సమన్వయకర్తలు ఎలా?

ప్రస్తుత సమన్వయకర్తలు ఎలా?

వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వైసిపి ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రధానంగా నియోజకవర్గాల్లో అభ్యర్థుల బలాబలాలపై అంతర్గత సర్వేలు ప్రారంభించింది. ప్రస్తుతం సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్న నేతలు పోటీ చేస్తే ఎలా ఉంటుందనే విజయావకాశాలపై సర్వే చేయించారు.

సర్వేల ఆధారంగానే టిక్కెట్లు

సర్వేల ఆధారంగానే టిక్కెట్లు

ఈ సర్వేలకు అనుగుణంగానే టిక్కెట్లు కేటాయించనున్నారు. ప్రస్తుతానికి అయితే చాలాచోట్ల ఇంచార్జులే బలంగా కనిపిస్తున్నారని తెలుస్తోంది. అయితే రెండు మూడు చోట్ల మాత్రం మారే అవకాశముందని అంటున్నారు. ఇక, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మరోలా ఉంటుందంటున్నారు.

English summary
YSR Congress Party survey on Guntur district winning candidates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X