వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు పోలవరం చిక్కు: ఏపీ మేకపాటిXటీ పొంగులేటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

YSRCP T and AP MPs different opinion on Polavaram
హైదరాబాద్/న్యూఢిల్లీ: పోలవరం విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పార్లమెంటు సభ్యులు భిన్నంగా స్పందిస్తున్నారు. పోలవరం ఆర్డినెన్స్‌ను ఆంధ్రప్రదేశ్ ఎంపీలు సమర్థిస్తుండగా.. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆ పార్టీ ఎంపీ మాత్రం వ్యతిరేకిస్తున్నారు.

లోకసభలో పోలవరం ఆర్డినెన్స్‌కు తమ పార్టీ అనుకూలమని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మంగళవారం చెప్పారు. ముంపు ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌లో చేర్చే సవరణకు తాము అనుకూలమని ఆయన పేర్కొన్నారు.

అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీనిని వ్యతిరేకించారు.
పోలవరం ఆర్డినెన్స్‌ను తాను వ్యతిరేకినని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. పోలవరం ముంపు ప్రాంతాలు తెలంగాణలోనే ఉండాలన్నారు.

కాగా, మంగళవారం లోకసభ పలుమార్లు పోలవరం, ధరల పెరుగుదల విషయమై వాయిదా పడిన విషయం తెలిసిందే. పోలవరం ఆర్డినెన్స్ తేవద్దని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు లోకసభలో ఆందోళన చేశారు. ఇతర విపక్షాలు ధరల పెరుగుదల పైన ఆందోళన తెలిపాయి.

English summary
YSRCP T and AP MPs different opinion on Polavaram project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X