కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లక్కీచాన్స్: చేరిన వెంటనే గంగులకు జగన్ బంపర్ ఆఫర్

టిడిపిని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన రెండు వారాలకే గంగుల ప్రభాకర్ రెడ్డికి ఎంఏల్ సి టిక్కెట్టు దక్కింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

కర్నూల్:పార్టీలో చేరిన రెండు వారాలకే ఎంఏల్ సి టిక్కెట్టు గంగుల ప్రభాకర్ రెడ్డికి కేటాయిస్తూ వైఎస్ఆర్ సిపి ఎంఏల్ సి టిక్కెట్టును కేటాయించింది. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న గంగుల సోదరులు గత అసెంబ్లీ ఎన్నికల ముందు టిడిపిలో చేరారు.అయితే భూమా నాగిరెడ్డి టిడిపి లో చేరడంతో గంగుల ప్రభాకర్ రెడ్డి టిడిపిని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. పార్టీలో చేరిన రెండు వారాలకే గంగులకు జగన్ పార్టీ ఎంఏల్ సి టిక్కెట్టు కేటాయించింది.

2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా కాంగ్రెస్ పార్టీని వీడి గంగుల ప్రభాకర్ రెడ్డి టిడిపిలో చేరారు.ఆళ్ళగడ్డ అసెంబ్లీ స్థానం నుండి టిడిపి అభ్యర్థిగా గంగుల ప్రభాకర్ రెడ్డి బరిలో నిలిచారు.అయితే వైసిపి అభ్యర్థిగా బరిలో నిలిచిన భూమా శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు.

రోడ్డు ప్రమాదంలో శోభా నాగిరెడ్డి మరణించింది.అయితే ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో శోభానాగిరెడ్డి విజయం సాధించారు. అయితే అభ్యర్థి మరణించినా ఎన్నికలు కొనసాగాయి.అయితే తిరిగి మరోసారి ఎన్నికను నిర్వహించారు.అయితే ఈ దఫా టిడిపి అభ్యర్థిని బరిలో దింపలేదు. దీంతో అఖిల ప్రియ విజయం సాధించారు.

2016 లో వైఎస్ఆర్ సిపికి గుడ్ బై చెప్పిన భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరారు. టిడిపిలో భూమా నాగిరెడ్డి చేరికను గంగుల ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా పార్టీ అధినేత మాత్రం గంగుల మాటను వినలేదు.

భూమా రాకతో టిడిపికి గుడ్ బై చెప్పిన గంగుల ప్రభాకర్ రెడ్డి

భూమా రాకతో టిడిపికి గుడ్ బై చెప్పిన గంగుల ప్రభాకర్ రెడ్డి

సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన గంగుల కుటుంబం చివరకు కాంగ్రెస్ పార్టీని వీడింది. రాష్ట్ర విభజన కారణంగా ఆంద్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఉండడంతో ఆ పార్టీని వీడి టిడిపిలో చేరారు గంగుల ప్రభాకర్ రెడ్డి. అయితే గంగుల ప్రభాకర్ రెడ్డికి టిడిపి టిక్కెట్టును ఇచ్చింది.అదే సమయంలో అదే నియోజవకర్గానికి ఆళ్ళగడ్డ టిడిపి ఇంచార్జ్ గా ఉన్న రాంపుల్లారెడ్డి కూడ గంగుల ప్రభాకర్ రెడ్డి చేరడాన్ని వ్యతిరేకించారు. రెండు వర్గాలను సమన్వయపర్చారు పార్టీ నాయకులు.అయితే 2016లో భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరడాన్ని గంగుల ప్రభాకర్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారు.పార్టీలో రెండు వర్గాలు ఆధిపత్యం నిరూపించుకొనేందుకు ప్రయత్నాలు సాగించాయి.ఇక చివరికి టిడిపిలో ఇమడలేక గంగుల ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడారు.

గంగుల, భూమా కుటుంబాల మధ్య ఆది నుండే పోరు

గంగుల, భూమా కుటుంబాల మధ్య ఆది నుండే పోరు

2009 ఎన్నికలకు ముందు వరకు భూమా నాగిరెడ్డి కుటుంబం టిడిపిలో కొనసాగింది. సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేయడంతో భూమా నాగిరెడ్డి కుటుంబం టిడిపిని వీడి పిఆర్ పి లో చేరారు.ఆనాడు శోభా నాగిరెడ్డి ఆళ్ళగడ్డ అసెంబ్లీ స్థానంనుండి విజయం సాధించారు.భూమా నాగిరెడ్డి టిడిపిలో ఉన్న సమయంలో గంగుల ప్రభాకర్ రెడ్డి కుటుంబాలకు మధ్య ఆధిపత్య పోరు సాగుతూండేది. ఈ రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఇది ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కన్పిస్తోంది.ఒకే పార్టీలో ఈ రెండు కుటుంబాలు కొనసాగే పరిస్థితులు మాత్రం లేవు. అయితే పిఆర్ పి ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో కొంత కాలంపాటు కాంగ్రెస్ పార్టీలో భూమా కుటుంబం ఉంది.అయితే తర్వాత కాలంలో జగన్ వైఎస్ఆర్ సిపిని ఏర్పాటు చేయడంతో జగన్ పార్టీలోకి జంప్ చేసింది భూమా కుటుంబం.

వైఎస్ఆర్ సిపి లో చేరిన రెండు వారాలకే ఎంఏల్ సి టిక్కెట్టు

వైఎస్ఆర్ సిపి లో చేరిన రెండు వారాలకే ఎంఏల్ సి టిక్కెట్టు

భూమా నాగిరెడ్డికి టిడిపిలో అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటుగా తన వర్గానికి ప్రాధాన్యత లేకపోవడంతో గంగుల ప్రభాకర్ రెడ్డి వర్గీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇదే సమయంలో భూమా నాగిరెడ్డికి మంత్రివర్గంలో కూడ చోటు దక్కే అవకాశం కూడ లేకపోలేదు. దీంతో గంగుల ప్రభాకర్ రెడ్డి టిడిపిని వీడారు.అయితే గత నెల 21వ, తేదిన గంగుల ప్రభాకర్ రెడ్డి టిడిపిని వీడి వైఎస్ఆర్ సిపిలో చేరారు.అయితే ఆయన వైసిపిలో చేరే సమయంలోనే జగన్ ఆయనకు ఎంఏల్ సి టిక్కెట్టును ఇస్తారనే హమీ ఇచ్చారని పార్టీలో ప్రచారం సాగింది.ఈ ప్రచారానికి తగ్గట్టుగానే ఎంఏల్ ఏ కోటా ఎంఏల్ సి అభ్యర్థిగా గంగుల ప్రభాకర్ రెడ్డిని వైసిపి ప్రకటించింది.

గంగుల రాజకీయ ప్రస్తానమిలా

గంగుల రాజకీయ ప్రస్తానమిలా

రుద్రవరం మండంల ఎర్రగుడిదిన్నె గ్రామానికి చెందిన మాజీ ఎంఏల్ఏ గంగుల తిమ్మారెడ్డి మూడో సంతానమే గంగుల ప్రభాకర్ రెడ్డి.డిగ్రీ వరకు చదివిన గంగుల ప్రభాకర్ రెడ్డి 1981 నుండి ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 1981 లో ఆళ్ళగడ్డ సర్పంచ్ పదవికి పోటీచేశారు. 1984 లో నంద్యాల విజయ డెయిరీ చైర్మెన్ గా ఎన్నికయ్యారు.1992లో ఆళ్ళగడ్డ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు.194,1999లో కూడ ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. 2014 లో కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలో చేరారు. 2017 ఫిబ్రవరిలో టిడిపిని వీడి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.శుక్రవారం నాడు గంగుల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు.

English summary
ysrcp top priority for gangula prabhakar reddy. gangula prabhakar reddy joined in ysrcp two weeks back.ysrcp chief jagan declared mlc candidate gangula prabhakar reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X