హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్మోక్&విన్: 'నాన్న సిగరెట్ తాగడం చూశా'(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పోగాకు ఉత్పత్తుల వల్ల కలిగే నష్టాలను సామాన్య ప్రజలకు తెలియజేయడానికి అపోలో అసూపత్రి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'స్మోక్ అండ్ విన్' పేరుతో అపోలో క్యాన్సర్ ఇనిస్టిట్యూట్లో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, ఏషియన్ గేమ్స్ 2014 మెడలిస్ట్ ప్రద్న్యా గాద్రె ప్రారంభించారు.

వీల్ ఆఫ్ మిజరీ ద్వారా చక్రం మధ్యలో సిగరెట్ ఏర్పాటు చేసి, అది ఏ జబ్బు వద్ద ఆగుతుందో, ధూమపానం వల్ల వారికి అది వచ్చే ప్రమాదముందని, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని ప్రచారం చేయనున్నారు.

సిగరెట్ తాగే పలువురు వ్యక్తులతో ఈ చక్రం తిప్పించి వ్యాధులపై అవగాహన కల్పించారు. ఒక సిగరెట్ తాగడం వల్ల ఊపిరితిత్తుల్లో ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో, రెండు బాటిల్స్ ద్వారా చూపించారు.

'మా నాన్న సిగరెట్ తాగడం చూశా'

'మా నాన్న సిగరెట్ తాగడం చూశా'

'స్మోక్ అండ్ విన్' పేరుతో అపోలో క్యాన్సర్ ఇనిస్టిట్యూట్లో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, ఏషియన్ గేమ్స్ 2014 మెడలిస్ట్ ప్రద్న్యా గాద్రె ప్రారంభించారు.

'మా నాన్న సిగరెట్ తాగడం చూశా'

'మా నాన్న సిగరెట్ తాగడం చూశా'

ఈ సందర్భంగా పుల్లెల గోపిచంద్ మాట్లాడుతూ సిగరెట్ తాగడం ఆపివేద్దామనుకుంటే ఈరోజు, ఈక్షణం నుంచే మొదలు పెట్టాలని సూచించారు. 'మా నాన్నా కూడా ధూమపానం చేసేవారు, దాని వల్ల ఎలాంటి అవస్ధలు వస్తాయో స్వయంగా చూశాను' అని అన్నారు.

'మా నాన్న సిగరెట్ తాగడం చూశా'

'మా నాన్న సిగరెట్ తాగడం చూశా'

యువత ఎక్కువగా స్మోకింగ్ చేస్తున్నారని, యువతులు కూడా స్మోకింగ్‌కు అలవాటు పడుతున్నారని అందోళన వ్యక్తం చేశారు. ధూమపానం వల్ల కలిగే నష్టాలపై ప్రభుత్వం విస్తృత ప్రచారం నిర్వహించాలని కోరారు.

'మా నాన్న సిగరెట్ తాగడం చూశా'

'మా నాన్న సిగరెట్ తాగడం చూశా'

ధూమపానం వల్ల ఎన్ని ఇబ్బందులు ఉంటాయో, తాను తన స్నేహితురాలి తండ్రి సిగరెట్ తాగినప్పుడు చూశానని ఏషియన్ గేమ్స్ మెడలిస్ట్ ప్రద్న్యా గాద్రె చెప్పారు.

'మా నాన్న సిగరెట్ తాగడం చూశా'

'మా నాన్న సిగరెట్ తాగడం చూశా'

పొగాకు ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేయాలని అపోలో కేన్సర్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ విజయా ఆనంద్ రెడ్డి సూచించారు.

English summary
Apollo Cancer Hospital launches 'Smoke & Win' campaign in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X