గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

60 అంతస్తుల్లో ఏపీ సచివాలయం: చంద్రబాబు యోచన

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిలో ప్రపంచ స్ధాయి ఆకాశ హర్మ్యాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున చైనా పర్యటనకు వెళ్లిన చంద్రబాబు బృందానికి షంగ్డు, షాంఘై ప్రావిన్స్‌ల్లో పర్యటించిన తర్వాత, అక్కడి ఆకాశ హర్మ్యాలను చూసిన తర్వాత సచివాలయం ఎలా ఉంటే బాగుంటుందో ఒక స్పష్టత వచ్చారు.

అమరావతిలో నిర్మించనున్న పాలన సముదాయ భవాలను సాదాసీదాగా ఉండకూడదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రాభివృద్ధికి చక్కగా అద్దంపట్టేలా బిల్డింగులను నిర్మించాలని భావిస్తున్నారు. కొత్త రాజధానిలో నిర్మించనున్న సచివాలయం కోసం 60 అంతస్ధుల ఆకాశ హర్మ్యాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

ఈ 60 అంతస్ధుల ఆకాశ హర్మ్యంలోని మొదటి రెండు అంతస్తుల్లో ప్రభుత్వ వాహనాల పార్కింగ్‌కు కేటాయించనున్నారు. మూడో అంతస్తు నుంచి ప్రభుత్వ విభాగాలకు, ప్రతి శాఖకూ ఒక ఫ్లోర్‌ కేటాయించాలని, శాఖాధిపతుల నుంచి మంత్రుల వరకూ అంతా అదే ఫ్లోర్‌లో ఉండేలా గదులు కేటాయించాలనే ఆలోచనలో ఉన్నారు.

Chandrababu plans to ap secretariat to build 60 stairs

ఇక ముఖ్యమంత్రి కార్యాలయాన్ని 57వ అంతస్తులో ఉండేలా, బిల్డింగ్‌పై హెలిపాడ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో పెట్టుబడుల కోసం చైనాలో సాగిన చంద్రబాబు పర్యటన విజయవంతమైందనే చెప్పుకోవాలి.
ఇందులో భాగంగా ఏపీలో చైనా ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తామని షంగ్డు, షాంఘై ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి.

చైనా పర్యటనలో చంద్రబాబు చాలా మంది పారిశ్రామికవేత్తలను కలిశారు. రూ. 100 కోట్ల పెట్టుబడితో ప్రత్యేకంగా చైనా తరహా పారిశ్రామిక పార్కులను ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వాలు ఆసక్తిని చూపాయన్నారు. అటు ప్రభుత్వ రంగ సంస్ధలతో పాటు ప్రైవేట్ సంస్ధలు కూడా ఏపీలో పెట్టుపడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయి.

English summary
Andhra Pradesh cheif minister Chandrababu plans to ap secretariat to build 60 stairs building.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X