వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ పిలుపు: సోనియా, రాహుల్ గ్రామాల దత్తత

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Sonia, Rahul adopt villages under Modi's model village scheme
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన ఆదర్శ 'సంసద్ గ్రామ్ యోజన' పిలుపుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉత్తరప్రదేశ్ లో సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలీ నియోజకవర్గం పరిథిలోని "ఉద్వా" గ్రామాన్ని ఆమె దత్తత తీసుకున్నారు.

ఈ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు ఆమె పూనుకున్నారు. ఉద్వా గ్రామం రానా బేణీ మాధవ్ జన్మస్ధలం కావడంతో ఎంతో చరిత్ర ఉంది. ఇక ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా తన సొంత నియోజక వర్గమైన అమేధీలోని జగదీష్‌పూర్ బ్లాక్‌లోని "ధీహ్" గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.

రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జగదీష్‌పూర్ బ్లాక్‌ పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. ఐతే పార్టీ వర్గాలు మాత్రం నరేంద్రమోడీ ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామాలను దత్తత తీసుకోలేదన్నారు.

జయ ప్రకాశ్ నారాయణన్ పుట్టిన రోజు సందర్బంగా ప్రధాని మోడీ ఆదర్శ సంసద్ గ్రామ్ యోజన పేరిట ప్రతి ఎంపీ మూడు గ్రామాలను దత్తత తీసుకుని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే దేశం అభివృద్ధి చెందుతుందని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

నేడు జీ20 సదస్సులో ప్రసంగించనున్న ప్రధాని మోడీ

ఆస్ట్రేలియాలోని బ్రిస్‌బేన్‌లో నేడు అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల సమాఖ్య గ్రూప్ 20 (జీ20) సదస్సు జరగనుంది. 20 దేశాల అధినేతలు పాల్గొనే ఈ సదస్సులో మోడీ ప్రసంగం కీలకం కానుంది. నల్లధనం నియంత్రణకు అంతర్జాతీయ స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.

నల్లధనాన్ని దేశానికి రప్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా బ్రిస్బేన్ లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీ మాట్లాడుతూ, నల్లధనం దేశ భద్రతకు పెను సవాల్ గా పరిణమించిందని అన్నారు.

విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెనక్కి రప్పించేందుకు తాము అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని ఆయన వెల్లడించారు. నల్లధనం వల్ల దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ సందర్భంగా ప్రస్తావించారు. విదేశాల నుంచి నల్లధనాన్ని స్వదేశం తీసుకురావడానికి ప్రపంచ దేశాల సహకారం, సమన్వయం అవసరమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.

English summary

 Congress president Sonia Gandhi and vice-president Rahul Gandhi have adopted one village each in their respective constituencies to develop them into model villages under "Saansad Adarsh Gram Yojana" launched by Prime Minister Narendra Modi last month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X