హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెమీ ఫైనల్: రోడ్లన్నీ ఖాళీ, ఓటమి (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో గురువారం నాడు రోడ్లపై హారన్ల మోత లేదు, వాహనాల రోద లేదు. చిందరవందరగా కనిపించే ట్రాఫిక్ లేదు. ట్రాఫిక్ సిగ్నిల్స్ వద్ద ట్రాఫిక్ పోలీసులు సందడి లేదు. దీనికంతటికి కారణం ఐసీసీ వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్‌లో భాగంగా సిడ్నీ క్రికెట్ మైదానంలో భారత్ ఆస్టేలియా తలపడటమే.

మార్చి 26 (గురువారం )న జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై ఆస్టేలియా 95 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ముగిసే వరకు నగరంలోని రోడ్లపై ఒక్కరూ కనిపించలేదు. దీంతో రహదారుల్లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.

మ్యాచ్ ప్రారంభానికి ముందు హోటళ్లు.. బార్లు.. రెస్టారెంట్లు.. స్టేడియాలు.. షాపులు.. ఇలా ఎక్కడ చూసినా కిక్కిరిసిన జనం. తలతిప్పకుండా టీవీలకు అతుక్కుపోయిన వైనం. నిత్యం జనాలతో రద్దీగా ఉండే రోడ్లు, మ్యాచ్ సందర్భంగా నిర్మానుష్యంగా మారాయి.

సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా రోడ్లన్నీ ఖాళీ

సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా రోడ్లన్నీ ఖాళీ

తెలంగాణ సచివాలయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారత్-ఆస్టేలియా సెమీ పైనల్ మ్యాచ్‌ను వీక్షిస్తున్న దృశ్యం.

 సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా రోడ్లన్నీ ఖాళీ

సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా రోడ్లన్నీ ఖాళీ

భారత్‌, అస్ట్రేలియా మధ్య జరిగిన క్రికెట్‌ సెమి ఫైనల్‌ను నగరవాసులు ఆసాంతం ఆసక్తిగా తిలకించారు. దీన్ని ప్రపంచకప్‌ పైనల్‌ మ్యాచ్‌గానే భావించి టీవీలకు అతుక్కుపోవడం తో నగరంలోని రోడ్లన్నీ బోసిపోయాయి.

సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా రోడ్లన్నీ ఖాళీ

సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా రోడ్లన్నీ ఖాళీ

భారత్-ఆస్టేలియా సెమీ పైనల్ మ్యాచ్‌ సందర్భంగా ఖైరతాబాద్ సర్కిల్ వద్ద నిర్మానుష్యంగా మారిన రోడ్డు. నిత్యం ట్రాఫిక్‌తో రద్దీగా ఉండే నారాయణగూడ ఫ్లైఓవర్‌, హిమయత్‌నగర్‌, తెలుగు తల్లి ప్లైఓవర్‌, ట్యాంక్‌ బండ్‌ నిర్మానుష్యంగా మారా యి. పంజగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్‌, దిల్‌ సుఖ్‌నగర్‌, కోఠి ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి కనిపించింది.

సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా రోడ్లన్నీ ఖాళీ

సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా రోడ్లన్నీ ఖాళీ

భారత్-ఆస్టేలియా సెమీ పైనల్ మ్యాచ్‌ సందర్భంగా ఎన్టీఆర్ మార్గ్ వద్ద నిర్మానుష్యంగా మారిన రోడ్డు. పలు బేకరీలు, హోటళ్లు, దుకాణ సముదాయాలు, ప్రైవేటు కార్యాలయాలు, షాపింగ్‌మాల్స్‌లలో ఈ మ్యాచ్‌ సందర్భంగా ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉద్యోగులు టీవిలు, కంప్యూట ర్లు, స్మార్ట్‌ఫోన్లలో క్రికెట్‌ వీక్షించారు. నిత్యం రద్దీగా ఉండే సిటీ లైబ్రరీలోని ఆవరణంతా ఖాళీ గా కనిపించింది.

సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా రోడ్లన్నీ ఖాళీ

సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా రోడ్లన్నీ ఖాళీ

ఉస్మానియా యూనివర్శిటీలోని పలు హాస్టళ్లలో టీవిల ఎదుట విద్యార్థులు గుమిగూడారు. అస్ట్రేలియా వికెట్లు పడుతుంటే చప్పట్లతో, ఈలలతో నగరవాసులు సందడి చేశారు.

సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా రోడ్లన్నీ ఖాళీ

సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా రోడ్లన్నీ ఖాళీ

సాయంత్రం 4గంటల వరకు టీవిలకు అతుక్కుపోయిన నగరవాసులు పేలవంగా సాగుతున్న భారత్‌ బ్యాటింగ్‌ను చూసి నిరాశతో ఇళ్లల్లోంచి వీధుల్లోకి రావడం కనిపించింది. నగరంలోని పలు చోట్ల క్రికెట్‌ గురించి చర్చిం చుకోవడమే కనిపించింది.

సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా రోడ్లన్నీ ఖాళీ

సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా రోడ్లన్నీ ఖాళీ

బయట పనివుండి వెళ్లేవారు మనసును ఆపుకోలేక ఫోన్లలో క్రికెట్‌ స్కోర్‌ తెలుసుకోవడం , బ్యాటింగ్‌ బాగా లేనప్పుడు విమర్శించడం, విశ్లేషించడం కనిపించింది.. అంతటా అలా అయితే బాగుండు.. ఇలా జరగకుంటే బాగుండే అనే మాటలే అన్నిచోట్లా వినిపించాయి.

సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా విశాఖపట్నంలోని రోడ్లన్నీ ఖాళీ

సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా విశాఖపట్నంలోని రోడ్లన్నీ ఖాళీ

మార్చి 26 (గురువారం )న జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై ఆస్టేలియా 95 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ముగిసే వరకు నగరంలోని రోడ్లపై ఒక్కరూ కనిపించలేదు. దీంతో రహదారుల్లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.

సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా విశాఖపట్నంలోని రోడ్లన్నీ ఖాళీ

సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా విశాఖపట్నంలోని రోడ్లన్నీ ఖాళీ

భారత్-ఆస్టేలియా సెమీ పైనల్ మ్యాచ్‌ సందర్భంగా పలు బేకరీలు, హోటళ్లు, దుకాణ సముదాయాలు, ప్రైవేటు కార్యాలయాలు, షాపింగ్‌మాల్స్‌లలో ఈ మ్యాచ్‌ సందర్భంగా ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా విశాఖపట్నంలోని రోడ్లన్నీ ఖాళీ

సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా విశాఖపట్నంలోని రోడ్లన్నీ ఖాళీ

భారత్-ఆస్టేలియా సెమీ ఫైనల్ మ్యాచ్ ను నగరంలోని పలు ఎలక్ట్రానిక్స్ దుకాణంలో వీక్షిస్తున్న క్రికెట్ అభిమానులు.

సెమీ ఫైనల్: రోడ్లన్నీ ఖాళీ, ఓటమి (ఫోటోలు)

సెమీ ఫైనల్: రోడ్లన్నీ ఖాళీ, ఓటమి (ఫోటోలు)

సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా విశాఖపట్నంలోని రోడ్లన్నీ ఖాళీ
భారత్-ఆస్టేలియా సెమీ ఫైనల్ మ్యాచ్ ప్రభావం నగరంలోని అన్ని ఆఫీలపై పడింది. మ్యాచ్ సందర్భంగా అన్ని ఆఫీసులు కూడా బోసిగా కనిపించాయి.

భారత్-ఆస్టేలియా సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా నిర్మానుష్యమైన విశాఖలోని జిల్లా కలెక్టరేట్‌.

English summary
Australia well and truly deserved the grand entry into the finals of the 2015 Cricket World Cup, but anticipation of an Indian win was high in Hyderabad on Thursday making many cricket lovers stay glued to their TV sets at home.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X