వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పదేళ్ళ బాలికకు కడుపులో రాళ్ళున్నాయని వెళ్తే బిడ్డ పుట్టింది

By Narsimha
|
Google Oneindia TeluguNews

చంఢీగఢ్: దగ్గరి బంధువు చేతిలో పలుమార్లు అత్యాచారానికి గురైన ఓ పదేళ్ళ బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.

కడుపులో రాళ్ళున్నాయని ఆపరేషన్ చేయాలని ఆమెను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువస్తే గర్భవతిగా తేలింది. అయితే పదేళ్ళ వయస్సులోనే ఆ బాలికకు గర్భస్రావం చేసేందుకుగాను సుప్రీంకోర్టు గత నెల 28న, నిరాకరించింది.

దీంతో చంఢీఘడ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని ఐసీయూలో వైద్యుల బృందం ఆ బాలికకు ఆపరేషన్ చేశారు. ముగ్గురు గైనకాలజిస్టులు, నియోనటాలజిస్టు, పిడియాట్రిషియన్ వైద్య బృందంలో ఉన్నారని బాలిక ఆరోగ్య పర్యవేక్షణ కోసం నియమించిన కమిటీ చైర్‌పర్సన్ డాక్టర్ దాసరి హరీష్ తెలిపారు.

10-year old rape-survivor delivers baby in Chandigarh after SC denied abortion plea

ఇది అసాధారణ గర్భమైనా సిజేరియన్ సజావుగా సాగిందని, శిశువు బరువు తక్కువగా ఉండడంతో ఐసీయూలోనే ఉంచినట్టు వైద్యులు చెప్పారు. బాలిక ఆరోగ్యం స్థిరంగా ఉందని చెప్పారు.

వైద్య ఖర్చులను ఛండీఘడ్ పాలనయంత్రాంగం భరిస్తోంది. భాలిక భవిష్యత్తు దృష్ట్యా బిడ్డను దత్తత ఇవ్వాలని ఆమె తండ్రి ఆసుపత్రి వర్గాలను కోరారు.

English summary
The 10-year-old girl, allegedly raped by her uncle, delivered a baby in a local hospital in Chandigarh after her abortion plea was rejected by the Supreme Court in July 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X