వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాంతి సాధనలో యోగ గొప్ప వరం,10 కోట్లమందికి శిక్షణ ఇలా....

By Narsimha
|
Google Oneindia TeluguNews

కోయంబత్తూరు:తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు సమీపంలోని ఉన్న' ఈశా యోగా 'కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అతిపెద్దదిగా రికార్డుల్లోకి ఎక్కిన 112 అడుగుల 'ఆదియోగి 'విగ్రహన్ని ప్రధానమంత్రి మోడీ ఆవిష్కరించారు.

తమిళనాడు, కేరళ రాష్ట్రాల సరిహద్దులోని కోయంబత్తూరు సమీపంలోని 'ఈశా' యోగాన్ని కేంద్రాన్ని శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ.

సద్గురు జగ్గి వాసుదేవ్ తో కలిసి ప్రధానమంత్రి మోడీ ఆశ్రమంలో పర్యటించారు. మహశివరాత్రిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు.

112-feet tall Shiva statue 'Adiyogi' unveiled Modi

యోగా కేంద్రంలో 112 అడుగుల ఎత్తైన 'ఆదియోగి' విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహన్ని ప్రధానమంత్రి మోడీ ఆవిష్కరించారు.

ఈ ప్రాంతం తమిళనాడు, కేరళ సరిహద్దుల్లోని పశ్చిమ కనుమల్లో ఉంది. మావోయిస్టులు, ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో పోలీసులు భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు.

'ఆదియోగి' ముఖాకృతి రూపకల్పన కోసం రెండున్నర ఏళ్ల సమయం పట్టింది. ఎనిమిది నెలలపాటు శ్రమించి 500 టన్నుల విగ్రహన్ని రూపొందించారు .ప్రపంచంలోనే అతిపెద్ద 'శివుని' విగ్రహంగా ఈ 'ఆదియోగి' విగ్రహం రికార్డుల్లోకి ఎక్కింది.

ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు.యోగ ఆరోగ్యానికి పాస్ పోర్టు వంటిదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. వైవిధ్యమన్నది మనలో ఏకత్వానికి ప్రతీక, జీవం ఎక్కడో ఉందో శివం అక్కడే ఉంది.జీవం నుంచి శివం చేరే యాత్ర యోగం , నేను నుంచి మనం వరకు సాగే యాత్ర యోగ , శివపార్వతుల కలయిక అంటే సముద్రాలు, హిమాలయాల సంగమని ఆయన చెప్పారు.

భారత్ ,యోగాను ప్రపంచానికి బహుమతిగా అందించిందని ఆయన చెప్పారు. దేశంలో అనేకమంది సాంఘిక రుగ్మతులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు.

శాంతి సాధనలో యోగ గొప్ప మార్పులు తీసుకువస్తోందని చెప్పారు. యోగను ప్రపంచమంతా ముక్తకంఠంతో స్వాగతించింది. నారీ అంటే నారాయణి,ఇది స్త్రీ మూర్తులకు మనమిచ్చిన గౌరవం.భారతదేశం ఒక గొప్ప వైవిధ్య సంస్కృతులున్న జీవధార, వైవిధ్యమన్నది భారతదేశ ఆత్మ, జీవనగమనమని మోడీ చెప్పారు.సత్యం ఒక్కటే ...కాని రూపాలు అనేకం, ఇది భారతీయ తత్వమని ఆయన వివరించారు.

మహాశివరాత్రి ఎంతో ముఖ్యమైన పండుగ, ఎంతో మంది దేవుళ్లు ఉన్నా..మహశివుడు గొప్ప.ఎన్నో మంత్రాలు ఉన్న మహా మృత్యుంజయ మంత్రం గొప్పది అని మోడీ చెప్పారు.మహాశివరాత్రి రోజున ఈశా యోగ కేంద్రంలో గడపడం తనకు సంతోషంగా ఉందన్నారు.ఆదియోగి పుస్తకాన్ని మోడీ ఆవిష్కరించారు.వచ్చే శివరాత్రి నాటికి 10 కోట్ల మందికి యోగ శిక్షణ ఇవ్వనున్నట్టు సద్గురు జగ్గి వాసుదేవ్ చెప్పారు.

English summary
Prime Minister Narendra Modi will unveiled the 112 feet tall lord Shiva statue in Coimbatore on friday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X