వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భూటాన్‌లో బెంగాల్ యువతిపై రేప్, హత్య: ఉద్రిక్తత

|
Google Oneindia TeluguNews

14-Year-Old Bengal Girl Allegedly Raped, Murdered in Bhutan; Violence in Her Village
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన 14ఏళ్ల యువతి భూటాన్ దేశంలో అత్యాచారారానికి గురైంది. అత్యాచారం అనంతరం దుండుగులు ఆమెను హత్య చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన బాధితురాలి కుటుంబసభ్యులు, గ్రామస్తులు భూటాన్ సరిహద్దులో అంతర్జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. ఓ పోలీసు వాహనానికి, ప్రైవేటు కారుకు నిప్పుపెట్టారు.

పోలీసుల కథనం ప్రకారం.. భూటాన్ సరిహద్దులోని జల్పాయిగురి జిల్లాలోని తన ఇంటి నుంచి బాధిత యువతి(14) పని మీద బయటికి వెళ్లింది. పని ముగించుకుని సాయంత్రానికి ఇంటికి చేరాల్సిన యువతి రాత్రయినా ఇంటికి చేరకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె కోసం గాలింపు చేపట్టారు.

కాగా, తమ కూతురు ఆరోగ్యం బాగోలేదని, ఆమెను తీసుకెళ్లాలని శనివారం భూటాన్ పోలీసులు బాధిత యువతి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో ఆందోళనగా అక్కడికి వెళ్లిన తల్లిదండ్రులు ఆమెను విగత జీవిగా చూడాల్సి వచ్చింది.

రూ. 10వేలు చెల్లించి ఆమె మృతదేహాన్ని తమ సొంతగ్రామానికి తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. మృతురాలు శరీరంపై గాయాలు ఉండటాన్ని ఆమె కుటుంబసభ్యులు గుర్తించారు. దీంతో తమ కూతురుపై అత్యాచారం చేసి హత్య చేశారని బాధితురాలు తల్లిదండ్రులు ఆరోపించారు.

కాగా, బాధితురాలి మృతి విషయం తెలుసుకున్న ఆమె బంధువులు, గ్రామస్తులు భూటాన్ సరిహద్దు అంతర్జాతీయ రహదారిపై ఆందోలళ నిర్వహించారు. రెండు వాహనాలకు నిప్పుపెట్టారు. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో భారీగా పోలీసులు చేరుకుని పరిస్థితిని సద్దుమణిగేలా చూశారు.

English summary
Villagers in North Bengal's Chamurchi, which borders Bhutan, blocked the international road, attacked a police vehicle and set a private car on fire after the body of a 14-year-old Indian girl was found from a house across the Bhutan border.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X