వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

14 ఏళ్ల బాలుడిపై పైశాచికం.. బట్టలు ఊడదీసి, మూత్రం పోసి...

14 ఏళ్ల దళిత బాలుడిని కొందరు బట్టలు ఊడదీసి, దుర్భాషలాడుతూ కొట్టడమే కాకుండా అతనిపై మూత్ర విసర్జన చేసిన వీడియో ఒకటి బుధవారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాపించింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 14 ఏళ్ల దళిత బాలుడిని కొందరు బట్టలు ఊడదీసి, దుర్భాషలాడుతూ కొట్టడమే కాకుండా అతనిపై మూత్ర విసర్జన చేసిన వీడియో ఒకటి బుధవారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాపించింది.

షాక్: గ్యాంగ్ రేప్ చేశాడని తీసుకొచ్చి సెల్ లో పెడితే.. మళ్లీ అక్కడ.., ఆ తరువాత ఏం జరిగిందంటే...షాక్: గ్యాంగ్ రేప్ చేశాడని తీసుకొచ్చి సెల్ లో పెడితే.. మళ్లీ అక్కడ.., ఆ తరువాత ఏం జరిగిందంటే...

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌ సమీపంలోని పిల్‌ఖానా గ్రామంలో చోటుచేసుకుంది. దళితుల సమస్యలపై మాట్లాడేందుకు రాజ్యసభలో తనను అడ్డుకున్నారని ఆరోపిస్తూ బీఎస్పీ చీఫ్‌ మాయావతి తన సభ్యత్వానికి రాజీనామా చేసిన తరువాతి రోజే ఈ వీడియో వెలుగులోకి వచ్చింది.

14-year-old Dalit boy stripped, brutalized by friends

8 మంది బాలురు తన చేతులను కట్టేసి దుస్తులు తొలగించారని బాధిత బాలుడు ఆరోపించాడు. తనను వదిలిపెట్టమని ఎంతగా ప్రాధేయపడినా వారు కనికరించకుండా కొట్టారని, చివరకు తనపై మూత్ర విసర్జన చేసి విడిచిపెట్టారని గోడు వెళ్లబోసుకున్నాడు.

తనను దుర్భాషలాడుతూ దళితుడినని పదేపదే హేళన చేశారని, వారిలో ఒకడు ఈ తతంగాన్ని అంతా వీడియో తీశాడని చెప్పాడు. ఈ కేసుకు సంబంధించి నిందితులందరినీ అరెస్ట్‌ చేసినట్లు అలీగఢ్‌ ఎస్పీ రాజేశ్‌ పాండే తెలిపారు.

English summary
A shocking video of a 14-year-old Dalit boy allegedly stripped and assaulted by his friends was widely shared on social media on Wednesday. The assailants shot the video to humiliate the boy, according to officials. The video, which shows the boy's hands tied to a stick and his trousers pulled down, was shot in Pilkhana area under Akrabad police station, 55 km from Aligarh district headquarters. Talking to the media, the victim’s father said that the accused youths were known to his son. “I do not understand why they beat and humiliated him in this manner. My son, who was also abused by them, is now in depression,” he added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X