వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పద్దెనిమిదేళ్ల కుర్రాడు.. ఏకంగా ఉపగ్రహాన్నే తయారుచేశాడు

పద్దెనిమిదేళ్ల కుర్రాడు ఏకంగా ప్రపంచంలోనే అత్యంత తేలికైన శాటిలైట్ తయారు చేశాడు. ఈ శాటిలైట్ ను ఈనెల 21న ‘నాసా’ అంతరిక్షంలోకి ప్రయోగించనుంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

చెన్నై: పద్దెనిమిదేళ్ల కుర్రాడు ఏకంగా ప్రపంచంలోనే అత్యంత తేలికైన శాటిలైట్ తయారు చేశాడు. మిస్సైల్ మ్యాన్, భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ పేరిట అతడు రూపొందించిన ఈ శాటిలైట్ ను ఈనెల 21న 'నాసా' అంతరిక్షంలోకి పంపనుంది.

స్మార్ట్ ఫోన్ కన్నా తక్కువ బరువు కలిగి ఉండే శాటిలైట్ 'కలామ్ శాట్'ను తమిళనాడుకు చెందిన విద్యార్థి రిఫత్ షారూక్(18) రూపొందించాడు. ఇతడు ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్నాడు.

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ 'నాసా' గతంలో 'క్యూబ్స్ ఇన్ స్పేస్' అనే పోటీని నిర్వహించింది. ఈ పోటీలో పాల్గొన్న రిఫత్ షారూక్, కార్బన్ ఫైబర్ పాలిమర్ తో ఈ అతి చిన్న శాటిలైట్ ను తయారు చేశాడు.

18-year-old from Tamil Nadu designs worlds lightest satellite

స్మార్ట్ ఫోన్ బరువు కన్నా తక్కువగా ఉండే ఈ శాటిలైట్ ను వచ్చే నెల 21వ తేదీన నాసా ప్రయోగించనుంది. వాలప్ప్ దీవి నుంచి ప్రయోగించనున్న ఈ అతి చిన్న ఉపగ్రహానికి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరిట 'కలామ్ శాట్' అని నామకరణం చేయడం విశేషం.

ఈ సందర్భంగా విద్యార్థి షారూక్, శాస్త్రవేత్తలు మాట్లాడుతూ, త్రీ డీ ప్రింట్ కార్బన్ ఫైబర్ పనితీరును తెలుసుకునేందుకు, అంతరిక్ష ప్రయోగాలను తక్కువ ఖర్చుతో నిర్వహించేందుకు 'కలామ్ శాట్' ఉపయోగపడుతుందని అన్నారు.

English summary
Eighteen-year-old Rifath Sharook, belonging to a comparatively unknown town of Pallapatti in Tamil Nadu, is all set to break a global space record by launching the lightest satellite in the world, weighing a mere 64 grams. The satellite, called KalamSat, will be launched by a NASA sounding rocket on June 21 from Wallops Island, a NASA facility. This will be the first time an Indian student's experiment will be flown by NASA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X