వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెమెన్‌కు ఉరిశిక్ష అమలు: రెండు నిమిషాల్లోనే..

By Pratap
|
Google Oneindia TeluguNews

నాగపూర్: 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల దోషి యాకుబ్ మెమెన్‌కు ఉరిశిక్ష అమలైంది. గురువారం ఉదయం 7 గంటలకు ముందే ఉరిశిక్ష విధించినట్లు సమాచారం అందింది. రెండు నిమిషాల్లో ఉరిశిక్షను అమలు చేసినట్లు తెలుస్తోంది. ఉరి తీసిన తర్వాత యాకుబ్ మెమెన్ మరణించినట్లుగా వైద్యులు సరిగ్గా ఉదయం 7.01 గంటలకు ప్రకటించారు.

ఉదయం ఆరున్నర గంటలకు ఆయనకు కిచిడీ పెట్టినట్లు తెలుస్తోంది. తనకు ఇష్టమైన కిచిడీని మెమెన్ అడిగినట్లు తెలుస్తోంది. దాన్ని కూడా ఆయన కేవలం సగం మాత్రమే తిన్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు మెమెన్‌ను జైలు సిబ్బంది నిద్రలేపి, స్నానం చేయించారు. తనకు ఇచ్చిన కొత్త దుస్తులను ధరించాడు. ఆ తర్వాత కొద్ది నిమిషాల పాటు అతను మౌనంగా కూర్కచున్సన్నట్లు తెలుస్తోంది. ఉరివేసిన వ్యక్తే యాకుబ్ మెమెన్‌కు కూడా ఉరి వేశాడు.

Yakub Memon

పుట్టిన రోజునే యాకుబ్ మెమెన్‌కు ఉరిశిక్ష పడింది. ఆయనకు గురువారంనాటికి 53 ఏళ్ల వయస్సు వచ్చింది. చివరి నిమిషంలో యాకబ్ మెమెన్ ఉరిశిక్షను ఆపించడదానికి ఆయన తరఫు న్యాయవాదులు చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. అర్థరాత్రి దాటిన తర్వాత విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు - మెమెన్‌కు ఉరిశిక్ష విధించాలనే నిర్ణయాన్ని సమర్థించింది.

అంతకు ముందు యాకుబ్ మెమెన్ పెట్టుకున్న మెర్సీ పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తోసిపుచ్చారు. దాంతో యాకుబ్ మెమెన్‌కు ఉరిశిక్ష ఖాయమని తేలింది. అయితే, అర్థరాత్రి పూట మెమెన్ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టు న్యాయమూర్తి తలుపు తట్టారు.

నాగపూర్‌లోని ఓ హోటల్లో బస చేసిన యాకుబ్ మెమెన్ కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. కుటుంబ సభ్యులు యాకుబ్ మెమెన్ ఉరి తీసే సమయానికి జైలుకు చేరుకున్నారు.

English summary
1993 Mumbai serial blasts convict Yakub Memon hanged in Nagpur Central jail. his is for the first time in India's Judicary history that the Supreme Court has opened its door for justice in the early hours into the day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X