ఘోరం: కదులుతున్న వాహనంలో తండ్రి కళ్లెదుటే కూతుళ్లపై గ్యాంగ్‌రేప్

గుజరాత్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు బాలికలను వారి కన్నతండ్రి ముందే కదులుతున్న వాహనంలోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు దుర్మార్గులు. గుజరాత్‌లోని దాహోద్‌ జిల్లా బరియా తహ్‌సి

Subscribe to Oneindia Telugu

అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు బాలికలను వారి కన్నతండ్రి ముందే కదులుతున్న వాహనంలోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు దుర్మార్గులు. గుజరాత్‌లోని దాహోద్‌ జిల్లా బరియా తహ్‌సిల్‌ దేవ్‌గఢ్‌లో ఈ ఘటన జరిగింది.

gangrape

ఈ కేసులో 13 మందిపై అపహరణ, అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు.. ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. కుమత్‌బరియా, గోప్‌సిన్హ్‌ బరియా అనే ఇద్దరు భుట్‌పగ్లా గ్రామానికి చెందిన 13, 15 ఏళ్ల వయస్సు గల అక్కాచెల్లెళ్లపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

కుమత్‌బరియా కుమారుడు ఓ మద్యం కేసులో అరెస్టు కావడానికి బాలికల తండ్రే కారణమని ఆగ్రహించి ఈ పని చేశామని నిందితులు బెదిరించినట్లు బాలికల తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, ఈ ఘటనలో పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

English summary
In a shocking incident, two teenage girls were allegedly gang-raped by six men in front of their father in a moving vehicle in Devgadh Baria tehsil of Dahod district in Gujarat today, police said.
Please Wait while comments are loading...