వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శృంగేరీ 37వ పీఠాధిపతిగా విధుశేఖర, గుంటూరుజిల్లాకు చెందినవారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

చిక్‌మగ్‌ళూరు: కర్నాటకలోని శృంగేరీ శారదాపీఠం అధిపతి భారతీ తీర్థస్వామి వారసుడిగా విధుసేఖర స్వామి సన్యాసం స్వీకరించారు. గురువారం నాడు ఆరంభమైన సన్యాస స్వీకారోత్సవం శుక్రవారంతో ముగిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా అనంతవరానికి చెందిన కుప్పా వెంకటేశ్వర ప్రసాద్ శర్మను భారతీతీర్థ స్వామి వారసుడిగా ఎంపిక చేశారు.

సన్యాస స్వీకారం అనంతరం ఆయన పేరును విధుశేఖర భారతిగా మార్చారు. ధార్మిక సంప్రదాయాల ప్రకారం సన్యాస స్వీకారోత్సవం నిర్వహించారు. విధుశేఖర తుంగా నదిలో స్నానాదులను పూర్తి చేశారు. అనంతరం విద్యాశంకర ఆలయాన్ని సందర్శించారు.

22 yr old is Sringeri Peetham's pontiff

ప్రత్యేక పూజలు నిర్వహించారు. విధుశేఖర భారతీ స్వామి శృంగేరీ శారధాపీఠం 37వ మఠాధిపతి. విధుశేఖర భారతి వయస్సు ప్రస్తుతం 22 ఏళ్లు. శృంగేరీ శారధాపీఠం తుంగ ఒడ్డున, బెంగళూరుకు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని ఆదిశంకరాచార్య ఏర్పాటు చేశారు.

విధుశేఖర భారతి సన్యాస స్వీకరోత్సవానికి దేశవ్యాప్తంగా దాదాపు యాభై వేల మంది హాజరయ్యారు. ప్రస్తుతం భరతీ తీర్ష స్వామి వారు శృంగేరీ పీఠాధిపతిగా ఉన్నారు. వారు అభినవ విద్యా తీర్థ స్వామీజీ (35వ పీఠాధిపతి) నుండి 1974లో స్వీకరించారు. ఈ సందర్భంగా బాధ్యతలను కొత్త పీఠాధి పైన పెడుతున్నట్లు చెప్పారు.

English summary
Sri Vidhushekara Bharati is the next anointed Jagadguru of Sringeri Sharada Peetham. During a 'Guru Vandana' programme held in the Math on Sunday, Jan 4 2015, Shri Bharati Tirtha Swamiji of Sringeri Shri Sharada Pitha made the announcement of nomination of Kuppa Venkateshwara Prasada Sharma.Now he is 37th jagadguru under the name of Sri Vidhushekhara Bharati
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X