వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు: సోనియా గాంధీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీకి చెందిన 25మంది సభ్యులపై స్పీకర్ 5 రోజులపాటు సస్పెన్షన్ వేటు వేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని ఆమె అన్నారు. ఐదురోజులపాటు పార్లమెంటును తామే బహిష్కరించాలని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌లు నిర్ణయించుకున్నాయి.

అంతకుముందు లోక్‌సభలో సభా సాంప్రదాయాలను అడ్డుకుంటున్నారని 25 మంది కాంగ్రెస్ ఎంపీలపై స్పీకర్ సుమిత్రా మహాజన్‌ సస్పెన్షన్‌ విధించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 377 రూల్ ప్రకారం ఈ 29 మంది ఎంపీలను ఐదు రోజుల పాటు సస్పెండ్ విధించినట్లు స్పీకర్ ప్రకటించారు.

25 Congress Lawmakers Suspended From Lok Sabha, Sonia Gandhi Says 'Black Day for Democracy'

సోమవారం లోక్‌సభ ప్రారంభమైన అనంతరం ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా సభ జరగక్కుండా ఆందోళనలు చేస్తున్న ఎంపీల పేర్లు చదివిన స్పీకర్, సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. అయినా సరే సభలో గందరగోళం చోటుచేసుకుంది.

లలిత్ మోడీ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్ధాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేశారు.

English summary
Lok Sabha Speaker Sumitra Mahajan has suspended 25 members of the Congress for five days for causing "grave disorder" in Parliament. "It's a black day for democracy," the party's president Sonia Gandhi told.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X