వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పునర్నిర్మాణమా?.. భారీ కుదుపా?: నీలేకని రీఎంట్రీపై డైరెక్టర్ల అసంతృప్తి, రాజీనామా దిశగా!

అదే జరిగితే సంస్థలో పునర్నిర్మాణానికి బదులు మరో భారీ కుదుపు తప్పదని చెబుతున్నారు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: సీఈవోగా విశాల్ సిక్కా రాజీనామాతో పెద్ద కుదుపుకు లోనైన ఇన్ఫోసిస్.. నష్ట నివారణ చర్యల్లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే సంస్థకు పునర్వైభవం రావాలంటే కంపెనీ మాజీ సీఈవో, ఆధార్ కార్డుల ఆర్కిటెక్ట్ నందన్ నీలేకనీతో రీ-ఎంట్రీ ఇప్పించాలని భావిస్తోంది.

ఆదుకోని బై బ్యాక్: అసలేం జరిగింది?.. అమెరికా ఫోకస్, అదే తేలితే ఇన్ఫీకి దెబ్బే?ఆదుకోని బై బ్యాక్: అసలేం జరిగింది?.. అమెరికా ఫోకస్, అదే తేలితే ఇన్ఫీకి దెబ్బే?

అయితే నీలేకనీ పునరాగమనం ఇన్ఫీ కష్టాలను తీరుస్తుందా? అంటే.. కొత్త తలనొప్పులను కూడా తీసుకొచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇన్ఫీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో కొంతమంది డైరెక్టర్స్ నీలేకనీ పునరాగమనం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో సంస్థ మొండిగా వ్యవహరిస్తే రాజీనామాకైనా వారు వెనకడాటం లేదని తెలుస్తోంది.

నారాయణ మూర్తి 'బ్లూవేల్' ఆడించారా?: సిక్కా ఏమన్నారంటే..?నారాయణ మూర్తి 'బ్లూవేల్' ఆడించారా?: సిక్కా ఏమన్నారంటే..?

టెక్ ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్:

టెక్ ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్:

ఇన్ఫోసిస్ లోకి నందన్ నీలేకనీ రీఎంట్రీపై ప్రస్తుతం టెక్ ఇండస్ట్రీలో హాట్ చర్చ జరుగుతోంది. 2009లో ఇన్ఫీ సీఈవోగా తప్పుకున్నప్పటి నుంచి కంపెనీ ఆయన్ను ఎలాంటి అధికారిక స్థానంలో కూర్చోబెట్టలేదు. కంపెనీకి చెందిన 12దేశీయ మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు నందన్ నీలేనీ రీఎంట్రీ పట్ల బోర్డుక లేఖ రాయడంతో.. ఆయన రాక పక్కా అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

పునర్నిర్మాణమా?..మళ్లీ కుదుపా?

పునర్నిర్మాణమా?..మళ్లీ కుదుపా?

నీలేకనీ రీఎంట్రీ విషయంలో కంపెనీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తుండటం సంస్థ భవిష్యత్తును కలవరపెడుతోంది. రాజీనామాకు సిద్దపడుతున్న డైరెక్టర్ల అభిప్రాయాలను వినిపించుకోకుండా.. నీలేకనీకి తిరిగి ఆహ్వానం పలికితే.. పునర్నిర్మాణంలో దాని ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. కాబట్టి నీలేకని ఎంట్రీ పునర్నిర్మాణానికి దారి తీస్తుందా? లేక మరో కుదుపుకు దారి తీస్తుందా? అన్నది ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం.

రాజీనామా బాటలో వీరు:

రాజీనామా బాటలో వీరు:

ఇన్ఫీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో భాగంగా ఉన్న రూపా కుద్వా, జెఫ్ లెహ్మన్, కో-చైర్మన్ రవి వెంకటేషన్ సహా చైర్మన్ ఆర్ శేషసాయి రాజీనామాకు సిద్దపడినట్లు కంపెనీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. రీఎంట్రీపై చర్చించడానికి బుధవారం నీలేకని, మూర్తి సమావేశం అయినట్లు చెబుతున్నారు. ఇన్ఫీ పునరాగమనం పట్ల నీలేకని మూర్తి నుంచి భరోసా కోరినట్లు తెలుస్తోంది.

సేఫ్ జోన్ లో వారు మాత్రమే:

సేఫ్ జోన్ లో వారు మాత్రమే:

ప్రస్తుతం ఇన్ఫీ బోర్డులో కొనసాగుతున్నవారిలో నారాయణమూర్తి దూరపు బంధువు డీఎన్ ప్రహ్లాద్, ఇటీవలే ఇన్ఫీ బోర్డులోకి చేరిన డీ సుందరం, పునితా కుమార్ సిన్హాలు మాత్రమే సేఫ్ జోన్ లో ఉన్నట్లు చెబుతున్నారు. నారాయణమూర్తి, నీలేకనితో సన్నిహిత సంబంధాలు కలిగిన బయోకాన్ చైర్మన్ కిరణ్ మజుందర్ షా కూడా బోర్డులో సభ్యురాలిగా ఉంటారన్నది అనుమానంగానే చెబుతున్నారు.

దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే నీలేకని చైర్మన్ షిప్‌లో మూర్తి బోర్డులో చేరే పరిణామాలు చోటు చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదన్న అభిప్రాయాలుకూడా వ్యక్తమవుతున్నాయి.

English summary
Nandan Nilekani, the architect of Aadhaar, is set to return to InfosysBSE 2.29 %, the company he co-founded 36 years ago at the age of 26, as non-executive chairman in the next few days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X