వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గగుర్పొడిచే విషయాలు: అందుకే నేపాల్ భూకంపం, ఇలా!

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నేపాల్‌లో భూకంపం ముందే ఊహించారా అంటే అవుననే చెప్పవచ్చు. నేపాల్ భూకంపై గురించి నిపుణులు షాకింగ్ విషయాలు చెబుతున్నారని అంటున్నారు. హిమాలయ పర్వతాల్లో భూకంప కేంద్రాలు ఉన్నాయి. దీంతో, పరిసరాల్లో తరుచూ భూమి కంపిస్తుంది. ఇందులో నేపాల్ కూడా ఉంది. నేపాల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో గతంలో భూకంపాలు ఏర్పడ్డాయి.

కాశ్మీర్, సిక్కిం, హిమాలయాల్లో భూకంపాలు ఏర్పడ్డాయి. అయితే, నేపాల్లో మాత్రం ఇంత పెద్ద భూకంపాలు ఇటీవలి కాలంలో రాలేదు. దీంతో ఆ ప్రాంతంపై ఎన్నో ఏళ్లుగా ఒత్తిడి ఏర్పడిందంటున్నారు. చివరిసారి 1934, 1950లలో భారీ భూకంపాలు వచ్చాయి.

గత యాభై ఏళ్లుగా నేపాల్లో ఎలాంటి భూకంపాలు రాకపోవడం, అదే సమయంలో చుట్టుపక్కల భూకంపాలు వస్తుండటంతో పరిశోధకులు.. పరిశీలించి ఇక్కడ ఎప్పుడైనా 8 తీవ్రతతో భూకంపం ఏర్పడే ప్రమాదముందని అంచనా వేశారు.

భూకంప బాధితులకు ఇప్పుడేం కావాలి?

3,723 confirmed dead in Nepal earthquake

నేపాల్లో భారీ భూకంపం నేపథ్యంలో మృతుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. వేలాది మంది మృతి చెందారు. 3,700 మందికి పైగా మృతి చెందారు. అయితే, జీవించి ఉన్న వారికి నీరు, ఆహారం దొరకడం కష్టంగా మారింది. చాలామంది గత రెండు రోజులుగా ఏమీ తనలేదు. వారికి దుస్తులు, నీరు.. ఇలా ఎన్నో అవసరం. బాధితులకు ఏం అవసరమనే విషయం కొందరు షార్ట్ లిస్ట్ చేశారు.

బాధితులకు ప్యూరిఫైడ్ మంచినీళ్లు, క్లోరిన్ టాబ్లెట్స్. పాడైపోని ఆహారపదార్థాలు. గాయపడ్డ వారికి, మెడికల్ ప్రొఫెషనల్స్‌కు కూడా అవసరమైన వస్తువులు. బ్లాంకెట్లు, టెంట్లు, మ్యాట్స్. బాడీ బ్యాగ్స్. శానిటరీ నాప్‌కిన్స్, కిట్స్. టార్చిలైట్లు. అన్ని అత్యవసర మెడిసిన్స్. ఫస్ట్ ఎయిడ్ మెటీరియల్. ఐవీ ప్లూయిడ్స్. ఐవీ యాంటీ బయోటిక్స్. వ్యక్తిగతంగా.. ఆర్థోపెడిక్, కార్డియోథెరిక్, ట్రామా సర్జన్లు, నర్సింగ్ స్టాఫ్.

English summary
As suggestion pours in from various quarters of the world, a few samaritans have summarised the requirements of the people who have been rehabilitated to make-shift camps. A group of young doctors have planned to visit Nepal with these aide for the rescue and relief of the people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X