వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమానంలో అసభ్య ప్రవర్తన: ముగ్గురి అరెస్ట్

|
Google Oneindia TeluguNews

తమిళనాడు: విమాన సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించిన కారణంగా ముగ్గురు ప్రయాణికులను తమిళనాడులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోయంబత్తూరు- చెన్నై ఇండిగో విమానంలో మద్యం సేవించినట్లుగా అనుమానిస్తున్న ఈ ముగ్గురు ప్రయాణికులు ఎయిర్ హోస్టెస్, ఇతర మహిళల పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించారు.

విచక్షణ మర్చిపోయి ప్రవర్తించడంతో పాటు, ఎయిర్ హోస్టెస్ ను సెల్‌ఫోన్‌లో ఫోటో తీయడానికి ప్రయత్నించారు. దీన్ని అడ్డుకున్న మిగతా సిబ్బందితో గొడవకు దిగారు. దీంతో విమాన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

indigo

ఈ ముగ్గురిపైనా కేసు నమోదయ్యాయి. వారిని గురువారం కోర్టులో హాజరు పరచగా, 14 రోజులు రిమాండ్ విధించింది. ముగ్గురు నిందితుల్లో ఇద్దరు సెంథిల్ కుమార్, రాజా పెరుందురైకి చెందినవారు కాగా, సుభాష్ స్వామినాథన్ త్రిచీకి చెందినవారు.

కాగా, నిందితుల్లో ఒకరు హిందూ మహాసభ నేత కాగా, మరో ఇద్దరు న్యాయవాదులు కావటం గమనార్హం. వీరి చేష్టల కారణంగా విమానం గంట ఆలస్యంగా బయల్దేరాల్సి వచ్చింది.

English summary
Three persons were arrested on a passenger flight after they allegedly misbehaved with cabin crew on a flight between Coimbatore and Chennai, news reports said on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X