వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: పాత నోట్లు కలిగి ఉంటే నేరం, ఆస్తులతోనే చిక్కులు

రద్దుచేసిన పాత నగదు నోట్లను ఆర్ బి ఐ వద్ద డిపాజిట్ చేసుకొనేందుకు మార్చి 31వ, తేదితో గడువు ముగుస్తోంది.అయితే ఏప్రిల్ నుండి పాత నోట్లను కలిగి ఉంటే చట్టవిరుద్దం.దీన్ని నేరంగా పరిగణిస్తారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రద్దుచేసిన పాత నగదు నోట్లను ఆర్ బి ఐ వద్ద డిపాజిట్ చేసుకొనేందుకు మార్చి 31వ, తేదితో గడువు ముగుస్తోంది.అయితే ఏప్రిల్ నుండి పాత నోట్లను కలిగి ఉంటే చట్టవిరుద్దం.దీన్ని నేరంగా పరిగణిస్తారు.

కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్ 8వ, తేదిన పెద్ద నగదు నోట్లను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకొంది. నల్లధనాన్ని నిర్మూలించేందుకుగాను కేంద్రం పెద్ద నగదు నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొంది.

అయితే రద్దుచేసిన నగదు నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకొనేందుకుగాను గత ఏడాది డిసెంబర్ 31వ, తేది వరకు అనుమతించారు.అయితే బ్యాంకుల్లో డిపాజిట్ల గడువు ముగిసింది.

ఇంకా తమ వద్ద పాత నోట్లు ఉన్నవారు ఎంపిక చేసిన ఆర్ బి ఐ కార్యాలయాల్లో మార్చి 31వ, తేది వరకు డిపాజిట్ చేసుకోవచ్చని కేంద్రం గడువిచ్చింది.అయితే ఈ గడువు ముగిసినా ఎక్కువగా పాత నగదు నోట్లు కలిగి ఉంటే మాత్రం నేరంగా పరిగణిస్తారు.

పాత నోట్లు కలిగి ఉంటే నేరస్తులే

పాత నోట్లు కలిగి ఉంటే నేరస్తులే

నల్లధనాన్ని నిర్మూలించే ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్ 8వ, తేదిన పెద్ద నగదు నోట్లను రద్దుచేసింది. అయితే రద్దు చేసిన పాత నగదు నోట్లను 2017 ఏప్రిల్ నుండి కలిగి ఉండడం నేరం.
ఈ మేరకు ఇటీవలనే కేంద్రం ఓ కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది.నల్లధనాన్ని మార్పిడి చేసుకొనేందుకుగాను అక్రమార్కులు చేసే ప్రయత్నాలకు అడ్డుకట్టవేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలను తీసుకొంది. పాత నగదును కలిగి ఉంటే పట్టుబడిన సొమ్ముకు ఐదురెట్లు జరిమానాగా చెల్లించాల్సిందే.

ఎన్ ఆర్ ఐ లకు జూన్ 30 వరకు గడువు

ఎన్ ఆర్ ఐ లకు జూన్ 30 వరకు గడువు

పాత నగదు ఆర్ బిఐ వద్ద డిపాజిట్ చేసుకొనేందకుగాను ఈ ఏడాది జూన్ 30వ, తేదివరకు ఎన్ ఆర్ ఐలకు కేంద్రం గడువిచ్చింది. అయితే ముంబై, ఢిల్లీ, కోల్ కతా, చెన్నై,నాగపూర్ లాంటి ఆర్ బి ఐ కేంద్రాల్లో మాత్రమే ఎన్ ఆర్ ఐ లు పాత నగదు నోట్లను డిపాజిట్ చేసుకొనే అవకాశం కల్పించింది కేంద్రం.

ఆధార్ తో తిప్పలే

ఆధార్ తో తిప్పలే

ఆధార్ తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు ప్రకటించింది.అయినా కేంద్రం మాత్రం ప్రతి దానికి ఆధార్ ను అనుసంధానం చేయడం తప్పనిసరి అంటోంది.బ్యాంకు ఖాతాలకు కూడ ఆధార్ ను అనుసంధానం చేయడం వల్ల ఆయా బ్యాంకుల ఖాతాదారుల సమాచారం తెలుస్తోంది. ఈ కారణాలతో పన్ను చెల్లింపులను ఎగ్గొట్టే అవకాశం లేదు.

లెక్కలు చూపని ఆస్తులు ఇబ్బందే

లెక్కలు చూపని ఆస్తులు ఇబ్బందే

లెక్కలు చూపని ఆస్తులుంటే ఇబ్బందిపడాల్సిన పరిస్థితులున్నాయి,అయితే మార్చి 31వ, తేది నాటికి కేంద్ర ప్రభుత్వం తమ లెక్కలు చూపని ఆదాయం వివరాలు వెల్లడించాలని ఆదేశించింది.అయితే ఈ ఆదేశాలను పాటిచనివారిపై కఠిన చర్యలు తీసుకోనుంది ఆదాయపు పన్నుశాఖ.ఇక నుండి అసిస్టెంట్ కమిషనర్ లేదా అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి గల ఆదాయపు పన్ను శాఖాధికారి ఎవరైనా వ్యక్తులు, సంస్థల ఇళ్ళపై దాడి చేసి సోదాలు నిర్వహించే అవకాశం ఉంది.

English summary
Possession of more than 10 notes in junked currency after March 31 is illegal for Indian residents. Violation of this is punishable with a fine which may extend to Rs. 10,000 or five times the amount of the face value of the notes, whichever is higher.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X