వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్వే: పెళ్లైనా ఇంటిపేరు మార్చుకోమంటున్న యువతులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెళ్లైన తర్వాత కూడా తమ ఇంటిపేరు మార్చుకునేందుకు 40 శాతం మందికి పైగా ఒంటరి మహిళలు ఆసక్తి చూపడంలేదని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని షాదీ డాట్‌కామ్ ఈ సర్వే నిర్వహించింది. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సర్వే వివరాలను షాదీ డాట్‌కామ్ గురువారం విడుదల చేసింది.

వివాహం గురించి తమ అభిప్రాయాలు చెప్పాలని అడగ్గా... 40 శాతం మంది ఒంటరి మహిళలు ఇంటి పేరు మార్చుకోమని చెప్పారు. మరో 27 శాతం మంది పెళ్లయిన తర్వాత ఆర్థిక స్వతంత్రంతో ఉండడానికి ఇష్టం చూపగా, 18 శాతం మంది మగవారితో సమానంగా కుటుంబ బాధ్యతలను పంచుకుంటామన్నారు. 14 శాతం మంది భర్తలు తమ తల్లిదండ్రులను సొంతవారిగా చూసుకోవాలని చెప్పారు.

‘40 p.c. women prefer to retain surname post marriage’

వివాహమవగానే ఇంటిపేరు మార్చుకోవడంతో ఒకరికి(భర్త) బానిసలుగా మారే ప్రమాదం ఉందని కొందరు యువతులు వ్యాఖ్యానిస్తే.. సర్‌నేమ్ మార్చుకుంటే విద్యా, ఉద్యోగ రంగాల్లో ఇబ్బందులు వస్తాయని మరికొందరు యువతులు అన్నారు.

స్వశక్తిని నిరూపించుకోవాలన్నా.. ఆర్థికంగా నిలబడాలన్నా.. మొదటి నుంచి వచ్చే ఇంటిపేరునే కొనసాగించుకోవడం మేలని 40శాతం మంది యువతుల భావన అని షాదీ.కామ్ పేర్కొంది. 24 నుంచి 38 ఏళ్ల మధ్యవయస్కులైన 11,200 మంది యువతులతో ఆన్‌లైన్ ద్వారా ఈ సంస్థ సర్వే నిర్వహించింది.

English summary
Over 40 per cent single Indian women don’t want to change their surname after getting married, according to a survey released ahead of Women’s Day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X