వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదీ లెక్క: ఐటీ సంక్షోభం దెబ్బకు 56వేల మంది అవుట్!, ఏ కంపెనీలో ఎంతంటే?

రిపోర్టులు చెబుతున్న దాని ప్రకారం.. కాగ్నిజెంట్‌ సంస్థ 15 వేల మంది ని, ఇన్ఫోసిస్‌ 3000కుపైగా సీనియర్‌ మేనేజర్లను చిట్టచివరి కేటగిరీలో చేర్చడానికి సిద్ధమయ్యాయి. డీఎక్స్‌సీ టెక్నాలజీ సంస్థలో 1,70,000 మద

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అమెరికాలో ట్రంప్ 'లోకల్' దెబ్బకు చాలామంది భారతీయ ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు అమెరికన్లకే ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అక్కడ రంగం సిద్దం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

మరోవైపు దేశీయ ఐటీ సైతం సంక్షోభం దిశగా పయనిస్తుండటంతో రానున్న రోజులు సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు మరింత గడ్డు కాలం కానున్నాయి. కాగా, ఈ ఒక్క ఉడాదిలోనే ఏడు ఐటీ కంపెనీల్లో 56వేల ఉద్యోగాలకు కోత పడుతున్నట్లుగా చెబుతున్నారు. ఇది ఆయనా సంస్థల హెచ్ఆర్ అధికారులు స్వయంగా ధ్రువీకరించడం గమనార్హం.

ఇవే ఆ ఏడు కంపెనీలు:

ఇవే ఆ ఏడు కంపెనీలు:

ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్ర, హెచ్‌సీఎల్‌ (భారతీయ కంపెనీలు), కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌, డీఎక్స్‌సీ టెక్నాలజీ కంపెనీ (అమెరికాకు చెందినవి), క్యాప్‌జెమినీ (ఫ్రాన్స్‌) సంస్థలన్నింటిలో కలిపి దాదాపు 12,40,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలోంచి 4.5శాతం మందిని.. అంటే 56వేల మందికి ఉద్వాసన పలికేందుకు కంపెనీలు ప్రణాళికలు రచిస్తున్నాయి.

పనితీరును సాకుగా చూపి:

పనితీరును సాకుగా చూపి:

ఉద్యోగుల తొలగింపునకు ఐటీ సంస్థలు చెబుతున్న కారణం 'పనితీరు'. పనితీరు సరిగా లేని, తక్కవ స్కిల్ కలిగిన ఉద్యోగులను తొలగిస్తున్నట్లుగా చెబుతున్నాయి. కాగా, ఒక్క ఏడాదిలోనే 56వేల మంది ఉద్యోగులు ఐటీ రంగంలో ఉద్వాసనకు గురికావడం ఇదే తొలిసారి అంటున్నారు పరిశీలకులు.

ఇదీ లెక్క:

ఇదీ లెక్క:

రిపోర్టులు చెబుతున్న దాని ప్రకారం.. కాగ్నిజెంట్‌ సంస్థ 15 వేల మంది ని, ఇన్ఫోసిస్‌ 3000కుపైగా సీనియర్‌ మేనేజర్లను చిట్టచివరి కేటగిరీలో చేర్చడానికి సిద్ధమయ్యాయి. డీఎక్స్‌సీ టెక్నాలజీ సంస్థలో 1,70,000 మది పనిచేస్తుండగా 10వేల మందికి ఉద్వాసన పలికేందుకు సిద్దమవుతున్నాయి. కంపెనీ యాజమాన్యాలు మాత్రం ఈ లెక్కలను అంగీకరించడం లేదు. ఉద్యోగాల ఉద్వాసన కేవలం ఊహాగానం మాత్రమే అని కొట్టిపారేస్తున్నాయి.

సగాని పైగా అమెరికన్సే ఉండేలా:

సగాని పైగా అమెరికన్సే ఉండేలా:

అమెరికాలో ఉన్న ఐటీ కంపెనీలు.. సగానికి పైగా అక్కడివారికే అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే విప్రో సంస్థ గత 18నెలల్లో 2800మంది అమెరికన్లను రిక్రూట్ చేసుకుంది. 2017జూన్ నాటికి దేశంలోని తమ ఉద్యోగుల్లో సగానికి పైగా అమెరికన్సే ఉండేలా యాజమాన్యం ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఇక్కడి ఉద్యోగుల జీతాల పెంపు కూడా వాయిదా పడటం.. అది కూడా కేవలం జేఎల్-5 గ్రేడ్ ఉద్యోగులకు మాత్రమే కావడం గమనార్హం.

English summary
It recission is the severe punishment for employees who are in hit list of the companies to send out. According to a report, more than 56thousand employees were may lost their jobs
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X