వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ మెట్రో రైలు జేబు దొంగల్లో 94 శాతం మంది మహిళలే.. డేటా విడుదల..!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రోలో పోలీసులకు చిక్కిన జేబు దొంగల్లో 94 శాతం మహిళేనని అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం గత జనవరి నుంచి నవంబర్ వరకు 11నెలలకు సంబంధించిన డేటాను విడుదల చేసింది.

ఢిల్లీ మెట్రో పరిధిలోని 134 రైల్వే స్టేషన్లలో భద్రతను పర్యవేక్షిస్తున్న సీఐఎస్ఎఫ్ జవాన్లు అరెస్ట్ చేసిన జేబు దొంగల్లో 293 మంది మహిళలు కాగా పురుషులు 22 మంది ఉన్నారు. ఢిల్లీ మెట్రో ర్వైల్వే స్టేషన్లలో మహిళలే ఎక్కువగా దొంగతనాలు చేస్తున్నారట.

94% pickpockets nabbed in Delhi Metro are women

చంటి పిల్లాడిని చంకలో వేసుకుని మహిళలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తారని సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా చంటిపిల్లలతో కనిపించే మహిళల పట్ల దొంగతనానికి సంబంధించిన అనుమానాలు కలగవు కదా. అందుకే, దీనినే ఆసరాగా చేసుకుని సదరు మహిళలు జేబు దొంగతనాల్లో పురుషులను మించిపోయారని అన్నారు.

గత ఏడాది ఢిల్లీ మెట్రో పరిధిలోని స్టేషన్లలో 466 మంది జేబుదొంగలను అరెస్టు చేయగా... అందులో 421 మంది మహిళలేనని పేర్కొన్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 29 లక్షలను డబ్బు రూపేణ, 9 కోట్ల రూపాయలను చెక్కుల రూపేణ రికవరీ చేశామని తెలిపారు. దీంతో ఢిల్లీ మెట్రో రైలెక్కే ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించే మహిళల పట్ల జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.

English summary
An overwhelming majority of pickpockets — 94% — caught in the Delhi Metro network this year are women, official data has revealed. Figures compiled by the Central Industrial Security Force (CISF) for 11 months, from January to November, show that a total of 293 women pickpockets were held as compared to 22 men in metro in the national capital region.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X