వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: 95% మందికి ఐటీ ఉద్యోగాలు రావు, టెక్కీల్లో నైపుణ్యాల కొరతే కారణమా?

భారత ఐటీ పరిశ్రమను ప్రతిభావంతుల కొరత వేధిస్తోందని ఆస్పైర్ సర్వే తేటతెల్లం చేస్తోంది.ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవారిలో 95 శాతం సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ ఉద్యోగాలకు సరిపోరని ఈ సర్వే నివేదిక వెల్లడిస్తోంది

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:భారత ఐటీ పరిశ్రమను ప్రతిభావంతుల కొరత వేధిస్తోందని ఆస్పైర్ సర్వే తేటతెల్లం చేస్తోంది.ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవారిలో 95 శాతం సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ ఉద్యోగాలకు సరిపోరని ఈ సర్వే నివేదిక వెల్లడిస్తోంది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొంటున్న నిర్ణయాల కారణంగా భారత ఐటీ పరిశ్రమకు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో ఆస్పైర్ నివేదిక కూడ టెక్కీలకు చుక్కలు చూపిస్తోంది.

చాలామంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కు సరైన నైపుణ్యాలు లేవని ఈ సంస్థ తన నివేదికలో స్పష్టం చేసింది.ప్రోగ్రాం రాయడం కూడ చేతకాని వారు కూడ ప్రోగ్రామింగ్ ఉద్యోగాలు నిర్వహిస్తున్నారని ఈ సర్వే తేల్చిపారేసింది.

భారత ఐటీ పరిశ్రమపై ఈ నివేదిక ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.ఇంజనీరింగ్ కాలేజీల్లో సౌకర్యాల లేమి కూడ ప్రధానంగా ఇంజనీర్లపై ప్రభావం చూపుతోంది. ఈ పద్దతులను మార్చుకోకపోతే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఆ సంస్థ తేటతెల్లం చేసింది.

95శాతం ఉద్యోగులు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకు పనికిరారు

95శాతం ఉద్యోగులు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకు పనికిరారు

భారత ఐటీ పరిశ్రమను ప్రతిభావంతుల కొరత వేధిస్తోంది. ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఉద్యోగాలను నిర్వహిస్తున్న సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ ఉద్యోగాలకు సరిపోరని ఆస్పైర్ మైండ్స్ సంస్థ తన సర్వే నివేదికలో తేటతెల్లం చేసింది.

ప్రోగ్రామింగ్ ఉద్యోగానికి కనీస అర్హత ప్రోగ్రాం రాయడం. అయితే కేవలం 4.77 శాతం మంది మాత్రమే సరైన లాజిక్ తో ప్రోగ్రాం రాస్తున్నారు. 500 కళాశాలల్లో 36 వేల మంది ఐటీ సంబంధిత బ్రాంచ్ కు చెందిన ఇంజనీరింగ్ విధ్యార్థులపై ఆస్సైరింగ్ మైండ్స్ అధ్యయనం చేసింది.

మూడింట రెండొంతుల మందికి నైపుణ్యాలు లేవు

మూడింట రెండొంతుల మందికి నైపుణ్యాలు లేవు

మూడింట రెండొంతుల మంది సరిగ్గా కంపైల్ చేసే కోడ్ ను రాయలేకపోతున్నారని ఈ సర్వే లో తేలింది. కేవలం 1.4 శాతం మంది మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలిగే ప్రోగ్రాం రాయగలుగుతున్నారని ఈ సర్వేలో తేలింది. కేవలం 1.4 శాతం మంది మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలిగే ప్రోగ్రాం రాయగలుగుతున్రాని వివరించింది. ప్రొగ్రామింగ్ నైపుణ్యాలు లేకపోవడం వల్ల భారత్ లోని ఐటీ, డేటా సైన్స్ ఎకోసిస్టమ్ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.

ప్రోగ్రామింగ్ లో భారత్ నేర్చుకోవాలి

ప్రోగ్రామింగ్ లో భారత్ నేర్చుకోవాలి

ప్రోగ్రామింగ్ విషయంలో ప్రపంచం మూడేళ్ల ముందుకు వెళ్ళిపోయింది. భారత్ దానిని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని ఆస్పరింగ్ మైండ్స్ సీటీఓ సహ వ్యవస్థాపకుడు వరుణ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు.

టైర్ 1 కళాశాలతో పోలిస్తే టైర్ 3 కశాశాలల్లో ప్రోగ్రామ్ నైపుణ్యాల లేమి ఐదు రెట్లు ఎక్కువగా ఉందని అగర్వాల్ చెప్పారు.టాప్ వంద కాలేజీల్లో 69 శాతం మంది విద్యార్థులు కంపైల్ చేసే ప్రోగ్రాంను రాయగా..మిగతా కాలేజీల్లో ఈ సంఖ్య 31 శాతం మాత్రమే ఉందని సర్వే తేల్చి చెప్పింది.

ప్రోగ్రామింగ్ లో అధ్యాపకులు కావాలి

ప్రోగ్రామింగ్ లో అధ్యాపకులు కావాలి

ప్రోగ్రామింగ్ కు కావాల్సిన మంచి అధ్యాపకులు కూడ లేరని ఈ సర్వే తేల్చి చెప్పింది. మంచి నైపుణ్యం ఉన్న ప్రోగ్రామర్లకు ఐటీ రంగంలో మంచి ఉద్యోగాలు రావడంతో వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారని తేలింది. కాలేజీల్లో చెప్పేవారికి కూడ ప్రోగ్రాంలు రాయడం వాటిని ఎగ్జిక్యూట్ చేసి చూపడం సరిగా తెలియడం లేదని సర్వే తేల్చింది.

English summary
95% of engineers don't have skills for software devolapment jobs says aspire minds survey.around 500 colleges conducted this survey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X