వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త: ఆగష్టు 24 నుండి రిలయన్స్ ఫీచర్‌ఫోన్ బుకింగ్ , ఎలాగంటే?

రిలయన్స్ జియో ఫీచర్‌ ఫోన్ కోసం ఆసక్తి నెలకొంది. అయితే ఈ ఫోన్ ఆగష్టు 15వ,తేదిన మార్కెట్లోకి రానుంది. అయితే సెప్టెంబర్‌నుండి వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: రిలయన్స్ జియో ఫీచర్‌ ఫోన్ కోసం ఆసక్తి నెలకొంది. అయితే ఈ ఫోన్ ఆగష్టు 15వ,తేదిన మార్కెట్లోకి రానుంది. అయితే సెప్టెంబర్‌నుండి వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది.

రిలయన్స్ జియో మార్కెట్లోకి రావడమే ఓ సంచలనంగా మారింది. ఫ్రీ వాయిస్ కాల్స్, డేటాతో ప్రత్యర్థి కంపెనీలకు జియో చుక్కలను చూపించింది.

అయితే జియో కారణంగా టెలికం పరిశ్రమ వేలాది కోట్లను నష్టపోయింది. అంతేకాదు ప్రత్యర్థి కంపెనీలు కూడ తీవ్రంగానే నష్టపోయాయి.అయితే రిలయన్స్ అనుసరిస్తున్నట్టుగానే టారిఫ్‌ ఫ్లాన్లను అనుసరించేందుకు ఇతర కంపెనీలు కూడ ప్రయత్నాలను ప్రారంభించాయి.

ఫీచర్ ఫోన్‌ విషయాన్ని ప్రకటించడంతో రిలయన్స్ షేర్లు బాగా ఎగబాకాయి. అత్యాధునికమైన సౌకర్యాలతో ఈ ఫీచర్ ఉంటుందని ముఖేష్ అంబానీ ప్రకటించారు.

జియో ఫీచర్ ఫోన్ బుకింగ్ ఆగష్టు 24 నుండే

జియో ఫీచర్ ఫోన్ బుకింగ్ ఆగష్టు 24 నుండే

రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్‌ను బుక్ చేసుకోవాలంటే ఆగష్టువరకు వేచి చూడాల్సిందే.అయితే ఈ ఫోన్‌ను తొలుత ఎవరు బుక్ చేసుకొంటే వారికి తొలుత ఈ ఫోన్ అందుబాటులోకి వస్తోందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఆగష్టు 15వ, తేదిన ఈ ఫోన్ మార్కెట్లోకి వస్తోంది. అయితే ఈ ఫోన్‌ను ఆగష్టు 24వ, తేదినుండి ఉచితంగా బుకింగ్ చేసుకొనే అవకాశాన్ని కల్పించింది రిలయన్స్.

Recommended Video

Reliance Jio New Phone features and booking details
ఎలా బుక్ చేసుకోవాలంటే

ఎలా బుక్ చేసుకోవాలంటే

రిలయన్స్ జియో ఫీచర్ పోన్‌ను ఎలా బుక్ చేసుకోవాలనే విషయమై తన వెబ్‌సైట్‌లో వివరించింది రిలయన్స్. మై జియో యాప్ ద్వారా ఈ ఫోన్‌ను బుక్ చేసుకోవచ్చని రిలయన్స్ ప్రకటించింది. దీనికితోడు రిలయన్స్ డిజిటల్ స్టోర్‌కు వెళ్ళి కూడ ఈ ఫోన్‌ను బుక్ చేసుకోవచ్చు. జియో ఫోన్‌ను బుక్ చేసుకొనేందుకు టోల్‌ఫ్రీ నెంబర్ 1860-893-3333 కు ఫోన్ చేయాలి.

ఎవరు ముందు బుక్ చేసుకొంటే వారికే ముందు ఫోన్లు

ఎవరు ముందు బుక్ చేసుకొంటే వారికే ముందు ఫోన్లు

రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ల కోసం ఎవరు ముందు బుక్ చేసుకొంటే వారికే ఈ ఫోన్లను ముందుగా అందించనున్నట్టు రిలయన్స్ ప్రకటించింది. ఈ ఫోన్లను బుక్ చేసుకోవడం కూడ ఆగష్టు 24వ, తేదినుండే ప్రారంభంకానున్నాయని ఆ కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్‌ను లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించినరోజునే అంబానీపై నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు.

ప్రతివారం ఐదు మిలియన్ల ఫోన్లు

ప్రతివారం ఐదు మిలియన్ల ఫోన్లు

ప్రతి వారంలో ఐదు మిలియన్ల ఫోన్లను వినియోగదారులకు అందించనున్నట్టు రిలయన్స్ జియో ప్రకటించింది. అయితే ఈ ఫోన్లన్నీ ఇండియాలోనే తయారుకానున్నాయి. అయితే ఈ ఫోన్ల కోసం తొలుత డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది. ఈ ఫోన్‌లో ఫీచర్లు కూడ బాగా ఉన్నాయి. అయితే ఫోన్ ఏ రకంగా పనిచేస్తోందనేది తేలాల్సి ఉంది.

English summary
Reliance JioPhone will be available to users who pre-book it on a first-come, first-serve basis. The JioPhone can be pre-booked from the company’s website, Reliance Digital stores across the country, or via MyJio app. Remember, bookings don’t start until August 24, so the option to pre-book the device will only appear after that date.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X