సినిమా చూపిస్తానని విద్యార్థినిపై ఫ్రెండ్ రేప్: స్నేహితులను పిలిపించి గ్యాంగ్ రేప్ !
పక్కింటిలో నివాసం ఉంటున్న విద్యార్థినిని నమ్మించిన యువకుడు సినిమాకు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చెయ్యడమే కాకుండా స్నేహితులను ఫోన్ చేసి పిలిపించి గ్యాంగ్ రేప్ చేసిన సంఘటన బెంగళూరు నగరంలో జరిగింది.
బెంగళూరు: పక్కింటిలో నివాసం ఉంటున్న విద్యార్థినిని నమ్మించి తీసుకెళ్లి అత్యాచారం చెయ్యడమే కాకుండా స్నేహితులను ఫోన్ చేసి పిలిపించి గ్యాంగ్ రేప్ చేసిన సంఘటన బెంగళూరు నగరంలో జరిగింది. పిణ్యా పారిశ్రామిక వాడలో నివాసం ఉంటున్న యువకుడు తన స్నేహితులతో కలిసి బాలిక మీద అత్యాచారం చేశాడని పోలీసులు చెప్పారు.
షాక్: బెడ్ రూంలో మమ్మీ, డాడీ రోమాన్స్: వీడియోలు తీసి షేర్ చేశాడు, యూట్యూబ్ లో !
పిణ్యాలోని పారిశ్రామిక వాడలో 14 ఏళ్ల బాలిక నివాసం ఉంటూ 9వ తరగతి చదువుతోంది. ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువకుడు బాలికతో స్నేహం పెంచుకున్నాడు. ఆ బాలిక స్నేహితుడైన యువకుడు నిత్యం ఆమెతో చనువుగా ఉంటున్నాడు.
సినిమా పేరుతో తీసుకెళ్లాడు
గత ఆదివారం బాలికకు మాయమాటలు చెప్పిన యువకుడు సినిమాకు పిలుచుకుని వెళ్లాడు. ఇద్దరూ సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చారు. తరువాత పిణ్యాలో నిర్మాణంలో ఉన్న బహుల అంతస్తుల కట్టడంలోకి బాలికను పిలుచుకుని వెళ్లాడు.
బాలికపై లైంగిక దాడి
నిర్మాణంలో ఉన్న బాలిక మీద అతను లైంగిక దాడి చేశాడు. బాలిక మీద రెండు మూడు సార్లు లైంగిక దాడి చేసిన యువకుడు తన కోరిక తీర్చుకున్నాడు. అంతటితో ఆగకుండా మొబైల్ ఫోన్ నుంచి స్నేహితులకు ఫోన్ చేశాడు. తన స్నేహితులను అదే కట్టడంలోకి రమ్మని చెప్పాడు.
బాలికను బెదిరించి గ్యాంగ్ రేప్
తన స్నేహితులతో కలిసి ఆ యువకుడు తనను నమ్మి వచ్చిన బాలిక మీద గ్యాంగ్ రేప్ చేశారు. పదే పదే లైంగిక దాడి చేశారు. రాత్రి వరకు బాలికను అదే కట్టడంలో నిర్బంధించి లైంగిక దాడి చేసిన నిందితులు విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి పారిపోయారు.
స్నేహితురాలి ఇంటిలో !
ఇంటికి వెళ్లడానికి భయపడిన బాలిక తన స్నేహితురాలి ఇంటికి వెళ్లి తలదాచుకుంది. ఐదు రోజులు అయినా బాలిక ఇంటికి రాకపోవడంతో తమ కుమార్తె ను కిడ్నాప్ చేశారని ఆమె కుటుంబ సభ్యులు పిణ్యా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి బాలిక కోసం గాలించి చివరికి ఆమెను గుర్తించారు.
కేసు నమోదు చేసిన పోలీసులు
బాలిక కోసం గాలించిన పోలీసులు ఎట్టకేలకు బాలిక ఆచూకి గుర్తించారు. తన స్నేహితుడు సినిమాకు పిలుచుకుని వెళ్లి తరువాత చేసిన దారుణం గురించి బాలిక కుటుంబ సభ్యులు, పోలీసులకు చెప్పింది. పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారని పోలీసులు చెప్పారు. బాధితురాలి తల్లి ఓ బ్లడ్ బ్యాంకు సంస్థలో ఉద్యోగం చేస్తోందని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.