వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైలు ప్రమాదం: 10 మంది మృతి.. బండరాయిని ఢీ కొనడం వల్లే?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: కర్ణాటకలోని హోసూరు వద్ద బెంగుళూరు-ఎర్నాకుళం ఇంటర్ సిటీ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. ట్రాక్ నుంచి పక్కకు 8 బోగీలు ఒరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. డీ-8 బోగీ పూర్తిగా దెబ్బతినట్లు తెలుస్తోంది.

పట్టాలపై ఉన్న పెద్ద బండరాయిని ఢీకొట్టడంతో రైలు ఇంజన్‌లో మంటలు చెలరేగిన నేపథ్యంలో దాని వెనుక ఉన్న బోగీలన్నీ పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. అసలు బండరాయి రైలు పట్టాలపైకి ఎలా వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఎన్టీఆర్ఎఫ్ బృందాలను సహాయక చర్యల నిమిత్తం అక్కడికి తరలించారు.

ప్రమాదంలో మరణించిన ముగ్గురు ప్రయాణీకులు మృతదేహాలను వెలికితీశారు. ఈ ప్రమాదంలో 23 మందికి తీవ్ర గాయాలైనట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదంలో గాయపడిన వారిలో నలుగురి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

మరోవైపు మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. రైలు పట్టాలు తప్పడంతో బెంగుళూరు-ఎర్నాకుళం మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంగ గౌడ ఘటనాస్ధలికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు.

ఆ తర్వాత రైల్వే మంత్రి సురేష్ ప్రభు కూడా ఘటనా స్ధలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సురేష్ ప్రభు, మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేలు, స్వల్పంగా కాయపడ్డ వారికి రూ. 20 వేలను అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

బెంగుళూరు-ఎర్నాకుళం రైలు ప్రమాదం పట్ల ప్రధాని మోడీ దిగ్భ్రాంతి

హోసూర్‌లో ఈరోజు ఉదయం జరిగిన బెంగళూరు-ఎర్నాకుళం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం పట్ల ప్రధాని నరేంద్రమోడీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతిచెందిన ప్రయాణీకుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢసానుభూతి ట్విట్టర్‌‌లో పేర్కొన్నారు.

 పట్టాలు తప్పిన బెంగుళూరు-ఎర్నాకుళం రైలు

పట్టాలు తప్పిన బెంగుళూరు-ఎర్నాకుళం రైలు

కర్ణాటకలోని హోసూరు వద్ద బెంగుళూరు-ఎర్నాకుళం రైలు పట్టాలు తప్పింది. ట్రాక్ నుంచి పక్కకు 8 బోగీలు ఒరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు.

 పట్టాలు తప్పిన బెంగుళూరు-ఎర్నాకుళం రైలు

పట్టాలు తప్పిన బెంగుళూరు-ఎర్నాకుళం రైలు

ఈ ప్రమాదంలో 23 మందికి తీవ్ర గాయాలైనట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదంలో గాయపడిన వారిలో నలుగురి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

 పట్టాలు తప్పిన బెంగుళూరు-ఎర్నాకుళం రైలు

పట్టాలు తప్పిన బెంగుళూరు-ఎర్నాకుళం రైలు

ప్రమాదంలో మరణించిన ముగ్గురు ప్రయాణీకులు మృతదేహాలను వెలికితీశారు. రైల్వే మంత్రి సదానంద గౌడ ప్రమాద ప్రాంతానికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.

 పట్టాలు తప్పిన బెంగుళూరు-ఎర్నాకుళం రైలు

పట్టాలు తప్పిన బెంగుళూరు-ఎర్నాకుళం రైలు

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఎన్టీఆర్ఎఫ్ బృందాలను సహాయక చర్యల నిమిత్తం అక్కడికి తరలించారు. రైలు పట్టాలు తప్పడంతో బెంగుళూరు-ఎర్నాకుళం మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

English summary
A Bangalore-Ernakullam inter-city train has derailed near Hosur injuring several passengers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X