షాక్: జయ మేనకోడలు దీపాపై చీటింగ్ కేసు: రూ. కోట్లు స్వాహా ! ఏం జరిగింది !

Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ మీద నగదు గోల్ మాల్ చేశారని చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజలను నమ్మించి కోట్ల రూపాయల నగదు వసూలు చేసి స్వాహా చేశారని దీపా మీద చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై స్థాపించిన దీపా జయకుమార్ చివరికి ఇలా చీటింగ్ కేసులో చిక్కుకుంటారని ఎవ్వరూ ఊహించలేకపోయారని తమిళనాడు ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఇంత కాలం దీపా ముఖ్య అనుచరుడిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తే ఆమె మీద చీటింగ్ కేసు పెట్టి సంచలనం సృష్టించాడు.

శశికళతో ఢీ అంటూ

జయలలిత మేనకోడలు దీపాను శశికళ, ఆమె కుటుంబ సభ్యులు దూరం పెట్టారు. జయలలిత మరణించిన తరువాత ఆమెకు మరింత వేధింపులు ఎక్కువ అయ్యాయని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో తాను కొత్త రాజకీయా పార్టీ పెడుతానని దీపా ప్రకటించారు.

దీపా పేరవై వచ్చింది

అమ్మ అభిమానులు, అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు దీపాకు మద్దతుగా నిలిచారు. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాదర్శిగా శశికళను అంగీకరించమని బహిరంగంగా ఎదురుతిరిగారు. తరువాత తమిళనాడులోని అన్ని జిల్లాల్లో దీపా పేరవై స్థాపించారు.

పేరు మార్చిన దీపా జయకుమార్

దీపా పేరవైని కాస్తా ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై అంటూ దీపా పేరు మర్చారు. జయలలిత పుట్టిన రోజు ఆమె సమాది దగ్గర ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై అనే పేరు ప్రకటించి ప్రజల్లోకి వెళ్లారు. తమిళనాడు రాష్ట్రం మొత్తం ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై సంస్థ పేరుతో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు.

 

 

పార్టీ పదవులతో రచ్చ

ఎంజీఆర్ అమ్మ దీపా పేరవైలో పదవుల పంపకంలో మొదట దీపా ఫ్యామిలీలోనే గొడవలు మొదలైనాయి. దీపా భర్త మాధవన్, ఆమె కారు డ్రైవర్ రాజాల మద్య గొడవ మొదలై అది కాస్తా కార్యకర్తల దగ్గరికి వెళ్లింది. ఆ గొడవ ముదిరిపాకానపడటంతో అప్పట్లో దీపా ఆందోళనకు గురైనారు.

తమిళనాడును నాలుగు భాగాలుగా

తమిళనాడులోని జిల్లాలను నాలుగు భాగాలుగా చేసిన దీపా తన ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై సంస్థకు పదాధికారులను నియమించారు. ఆ నాయకులు వారివారి జిల్లాల్లో భారీ ఎత్తున ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై సంస్థలో సభ్యులను చేర్చారు.

సభ్యత్వం ముసుగులో రూ. కోట్లు వసూలు చేశారు !

ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై సంస్థలో సభ్యులుగా చేరేవారు కొంత మొత్తంలో సభ్యత్వ రుసుం చెల్లించారు. ఈ సభ్యత్వ నమోదు వలన కొన్ని కోట్ల రూపాయాలు వసూలు అయ్యిందని, ఆ డబ్బు మొత్తం దీపా స్వాహా చేశారని ఆ సంస్థలో ఇంత కాలం కీలకపాత్ర పోషించిన నాశపాక్కం జానకీరామన్ ఆరోపిస్తున్నారు.

చెన్నైలో కేసు నమోదు

ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై సంస్థ పేరుతో సభ్యత్వ రుసుం వసూలు చేసిన దీపా కొన్ని కోట్ల రూపాయలు స్వాహా చేశారని నాశపాక్కం జానకీరామన్ చెన్నైలోని మాంబళం పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఫిర్యాదు చేశారు.

జయలలిత మేనకోడలు

దీపా మీద ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఇప్పుడు విచారణ మొదలుపెట్టారు. మొత్తం మీద ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై సంస్థ పేరుతో దీపా కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసి భారీ మొత్తంలో నగదు స్వాహా చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

English summary
A complaint has been filed against Deepa Jayakumar for Money cheating case in MGR Amma Deepa Peravai application form.
Please Wait while comments are loading...