వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దావూద్ ఇబ్రహీం ఎన్ కౌంటర్ జస్ట్ మిస్ !

|
Google Oneindia TeluguNews

ముంబై: 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల సూత్రధారి, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను చంపేందుకు వేసిన ఎన్ కౌంటర్ ప్లాన్ మిస్ అయ్యిందని చెప్పిన బీజేపీ ఎంపీ, మాజీ హోం శాఖ మంత్రి ఆర్.కే. సింగ్ ను ప్రశ్నించడానికి ముంబై పోలీసులు సిద్దం అయ్యారు.

ఇటివల బీజేపీ ఎంపీ ఆర్.కే. సింగ్ ఆజ్ తక్ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయం చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వం విచారణ చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. ఆర్. కే. సింగ్ వెల్లడించిన ఆసక్తికర విషయాలు ఈ విదంగా ఉన్నాయి.

2000 సంవత్సరంలో వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో దావూద్ ఇబ్రహీం ను అంతం చెయ్యడానికి ఒక ప్లాన్ వేశారు. మహారాష్ట్రలో ఒక సీక్రెట్ మిషన్ ఎర్పాటు చేశారు. అందులో చోటా రాజన్ గ్యాంగ్ సభ్యులు ఉన్నారు.

A group was being trained to target Dawood Ibrahim

అందరికి శిక్షణ ఇచ్చి దావూద్ ఇబ్రహీం ను ఎన్ కౌంటర్ చెయ్యాలని ప్లాన్ వేశారు. అయితే ఈ విషయంలో దావూద్ కు అమ్ముడు పోయిన ముంబై పోలీస్ ఇన్స్ పెక్టర్ల ద్వార ఈ విషయం లీకైయ్యిందని అన్నారు. తరువాత దావూద్ అలర్ట్ అయ్యాడని చెప్పారు.

ఇదే విషయాన్ని ఆర్.కే. సింగ్ ఇంటర్వూలో వివరించారు. ఆర్.కే. సింగ్ వ్యాఖ్యలు కలకలం రేపడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు ఆర్.కే. సింగ్ ను విచారణ చేసి పూర్తి వివరాలు సేకరించడానికి సిద్దం అయ్యారు.

అమ్ముడు పోయిన పోలీసు అధికారులు ఎవరు, ఎక్కడున్నారు అని కూపీలాగుతున్నారు. అదే విదంగా మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు రహస్యాలు చేరవేస్తున్నది ఎవరు, వారిలో ఇప్పుడు పోలీసులు ఉన్నారా అని పూర్తి వివరాలు బయటకులాగుతున్నారు.

English summary
Describing as "serious" the purported claims by BJP leader and former home secretary RK Singh regarding Mumbai Police botching up a bid to go after fugitive don Dawood Ibrahim.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X