కన్నడ నటితో టెక్కీ రోమాన్స్,:సహజీవనం, మొబైల్ లో, పెళ్లి అంటే జెండా ఎత్తేశాడు !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, ఇప్పుడు తప్పించుకుని తిరుగుతున్నాడని కన్నడ నటి బెంగళూరు నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను మోసం చేసి తాను మాట్టాడిన మాటలు రికార్డు చేసుకుని ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆమె ఆరోపిస్తోంది.

కారులో విద్యార్థినిపై గ్యాంగ్ రేప్, ప్రధాని మోడీకే లేఖ రాసింది, జ్యూస్ లో మత్తు మందు కలిపి !

బెంగళూరు నగరంలోని సదాశివనగర పోలీసులు ప్రాజెక్టు ఇంజనీరు (టెక్కీ) ఉల్లాస్ పటేల్ మీద కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు. తనకు పోలీసులు కచ్చితంగా న్యాయం చేస్తారని ఆశగా ఎదురు చూస్తున్నానని కన్నడ నటి అంటున్నారు.

కన్నడ నటి

కన్నడ నటి

కన్నడ నటి, ప్రాజెక్టు మేనేజర్ (టెక్కీ) ఉల్లాస్ పటేల్ గత రెండేళ్లుగా స్నేహితులు. ఇద్దరు ఖాళీగా ఉన్న సమయంలో వారి స్నేహితులతో కలిసి తిరిగారు. నటి, ఉల్లాస్ పటేల్ వారి స్నేహితులు కలిసి సరదాగానే గడిపేవారని సమాచారం.

స్నేహం ప్రేమగా మారింది !

స్నేహం ప్రేమగా మారింది !

కన్నడ నటి, ఉల్లాస్ పటేల్ స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరూ ప్రేమికులు అని వారి స్నేహితులు అందరికీ తెలుసని సమాచారం. ఉల్లాస్ పటేల్, కన్నడ నటి వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్బంలో వీరు మరింత చనువుగా ఉన్నారని తెలిసింది.

లివింగ్ టు గెదర్ !

లివింగ్ టు గెదర్ !

ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించిన తరువాత గత రెండు మూడు నెలల నుంచి సహజీవనం (లివింగ్ టు గెదర్) చేశారని సమాచారం. సదాశివనగర సమీపంలో కుటుంబ సభ్యులకు తెలీకుండా ప్రత్యేకంగా ఇల్లు తీసుకుని సహజీవనం చేశారని తెలిసింది.

మైసూరుకు వెళ్లి వస్తే !

మైసూరుకు వెళ్లి వస్తే !

జూన్ 3వ తేదీన తాను పనిపై మైసూరుకు వెళ్లానని, తిరిగి వచ్చి చూడగా ఉల్లాస్ పటేల్ మాయం అయ్యాడని, ఫోన్ చేస్తే మన పెళ్లికి మా పెద్దలు అంగీకరించడం లేదని అతను ముఖం చాటేశాడని కన్నడ నటి సదాశివనగర పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బూతులు తిడుతోంది !

బూతులు తిడుతోంది !

ఉల్లాస్ పటేల్ తో పాటు ఆమె తల్లి తన మొబైల్ కు ఫోన్ చేసి మర్యాదగా ఉండకపోతే నీ అంతు చూస్తాం అంటూ బెదిరిస్తూ బూతులు తిడుతున్నారని నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా నాకు ప్రాణహాని ఉందని ఆమె ఆరోపిస్తోంది.

ఉల్లాస్ స్నేహితులు సైతం !

ఉల్లాస్ స్నేహితులు సైతం !

మేము ఇద్దరం ఏకాంతంగా ఉన్న సమయంలో ఉల్లాస్ పటేల్ అతని స్నేహితుల గురించి చెడుగా మాట్లాడమని చెప్పాడని, ప్రియుడు చెప్పినట్లు తాను విన్నానని, ఆయన స్నేహితులను చెడుగా మాట్లాడుతున్న సమయంలో ఆ మాటలు మొబైల్ లో రికార్డు చేసుకుని ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆమె ఆరోపిస్తోంది.

ఉల్లాస్ పటేల్ ఎక్కడ ?

ఉల్లాస్ పటేల్ ఎక్కడ ?

కన్నడ నటికి మోసం చేసిన ఉల్లాస్ పటేల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుని విచారణ చేస్తున్నామని సదాశివనగర పోలీసులు అంటున్నారు. అతని మీద ఐపీసీ 376, 417 సెక్షన్ ల కింద అత్యాచారం, మోసం తదితర కేసులు నమోదు చేసి విచారణ మొదలు పెట్టామని పోలీసులు అంటున్నారు.

English summary
A Kannada actress has filed a complaint of sexual harassment against her boyfried in Bengaluru.
Please Wait while comments are loading...