వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముస్లీం యువతితో మైనర్ లవ్ మ్యారేజ్: వయస్సు తక్కువ, కాపురానికి లైసెన్స్ లేదని!

|
Google Oneindia TeluguNews

మైసూరు: ప్రేమించి మతాంతర వివాహం చేసుకున్న నవదంపతులు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. చట్టం ప్రకారం వరుడి వయస్సు తక్కువగా ఉండటంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో వారిని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.

<strong>భార్య ప్రజాప్రతినిధి: ప్రియుడితో బెడ్ రూంలో నగ్నంగా: వీడియో తీసిన భర్త ఏం చేశాడంటే!</strong>భార్య ప్రజాప్రతినిధి: ప్రియుడితో బెడ్ రూంలో నగ్నంగా: వీడియో తీసిన భర్త ఏం చేశాడంటే!

తీరా యువకుడికి వయస్సు తక్కువ ఉండటంతో నానా తంటాలు పడుతున్నారు. మతాంతర వివాహం చేసుకోవడంతో యువతి, యువకుడి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. ఇప్పుడు పంచాయితీ పోలీసుల దగ్గరకు వెళ్లింది. వధూవరుడికి అండగా కొన్ని సంఘ, సంస్థలు ముందుకు వచ్చాయి.

ముస్లీం యువతి

ముస్లీం యువతి

మైసూరు నగరంలోని జయపురలో నివాసం ఉంటున్న సమీరా, జనతా నగర్ లో నివాసం ఉంటున్న హేమంత్ ఇద్దరూ కొన్ని సంవత్సరాల నుంచి స్నేహితులు, పీయూసీ (ఇంటర్) పూర్తి చేసిన హేమంత్ ప్రస్తుతం డ్రైవర్ గా పని చేస్తున్నాడు.

లవ్ మొదలైయ్యింది !

లవ్ మొదలైయ్యింది !

సమీరా, హేమంత్ ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. అయితే వేరే మతం వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సమీరా కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పెద్దలను ఎదిరించి హేమంత్ ను పెళ్లి చేసుకోవడానికి సమీరా సిద్దం అయ్యింది.

దేవాలయంలో పెళ్లి

దేవాలయంలో పెళ్లి

రెండు రోజుల క్రితం సమీరా, హేమంత్ మైసూరులోని ఓ దేవాలయంలో హిందూ సాంప్రధాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. హేమంత్, సమీరా స్నేహితులు పెళ్లి పెద్దలు అయ్యారు. పెళ్లి అయిన తరువాత అసలు సమస్య ఎదురైయ్యింది.

హేమంత్ మైనర్

హేమంత్ మైనర్

సమీరాకు 18 ఏళ్లు పూర్తి అయ్యింది. చట్టప్రకారం ఆమె పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే వరుడికి 21 ఏళ్లు పూర్తి కాకుండా పెళ్లి చెయ్యకూడదని చట్టం చెబుతోంది. హేమంత్ కు 21 ఏళ్ల పూర్తి కావాలంటే ఇంకా మూడు నెలల సమయం ఉంది. అతని పెళ్లికి మూడు నెలల వయస్సు తక్కువ కావడంతో సమస్య ఎదురైయ్యింది.

న్యాయం చెయ్యండి !

న్యాయం చెయ్యండి !

వధువు సమీరా మైసూరు దక్షిణ గ్రామీణ పోలీసులను ఆశ్రయించింది. హేమంత్ ను తాను ఇష్టపడే పెళ్లి చేసుకున్నానని, అయితే అతనికి పెళ్లి చేసుకోవడానికి మూడు నెలలు వయస్సు తక్కువగా ఉందని పోలీసు అధికారి జగదీష్ కు చెప్పింది. మూడు నెలల పాటు మాకు రక్షణ కల్పించాలని మనవి చేసింది.

మా ఫ్యామిలీతో సమస్య !

మా ఫ్యామిలీతో సమస్య !

మా ప్రాణాలకు ఎదైనా హాని జరిగితే అందుకు మా కుటుంబ సభ్యులే కారణం అంటూ సమీరా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. పోలీసు అధికారి జగదీష్ వెంటనే సమీరా, హేమంత్ కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి మాట్లాడారు.

ఇటీవలే గొడవలు

ఇటీవలే గొడవలు

ఇటీవల మైసూరు సమీపంలోని పాండవపురలో ఓ జంట మతాంతర వివాహం చేసుకోవడంతో గొడవలు మొదలైనాయి. ఇప్పుడు మైసూరు నగరంలో ఇలాంటి ఘటన ఎదురు కావడంతో పోలీసులు ఇరు వర్గాల మత పెద్దలను పిలిపించి మాట్లాడారు.

English summary
A minor Hindu boy has married muslim girl in Mysuru. The boy is just 3 months away from attaining majority. Both were in love. The muslim girl has urged police not to take any action till her 'husband' reaches 21 years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X