వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతిష్టకు విఘాతం: జవదేకర్, అమీర్‌కు ఫరా సపోర్ట్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు దేశ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. బుధవారం ఆయన అమీర్ వ్యాఖ్యలపై స్పందించారు.

అమీర్ వ్యాఖ్యలతో తాము ఏకీభవించలేమని, ఎందుకంటే దేశంలో సహనం వారసత్వంగా వస్తోందని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు అమీర్ వ్యక్తిగతమే అయి ఉండవచ్చుగానీ, అవి దేశంలో చాలా మంది మనోభావాల్ని దెబ్బతీసేవిగా ఉండటం బాధాకరమని తెలిపారు.

అందువల్ల దేశ ప్రతిష్టే కాకుండా అమీర్ వ్యక్తిగత ప్రతిష్ట కూడా దిగజారుతుందని అన్నారు. అనేక ప్రభుత్వ కార్యక్రమాలకు అమీర్ ఖాన్ ప్రచారకర్తగా ఉన్నాడని, అలాంటి వ్యక్తి ఈ వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.

aamir

అమీర్‌కు ఫరా ఖాన్ మద్దతు

అమీర్‌ఖాన్‌పై అంతా కలిసి ఎదురుదాడికి దిగడం సరికాదని బాలీవుడ్‌ ప్రముఖ దర్శకురాలు ఫరాఖాన్‌ అన్నారు. దేశంలోనిజంగా సహనశీలత ఉంటే.. అంతా కలిసి ఇలా ఆయనపై విరుచుకుపడేవారా? అని ప్రశ్నించారు.

అసహనం పెరుగుతోందనడానికి ఈ ఘటనే పెద్ద ఉదాహరణ అన్నారు. ఢిల్లీలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో అమీర్‌ దేశంలో సహన శీలత తగ్గిపోతుండటంతో తన భార్య తనను దేశం వదిలి వెళ్లిపోదామని అడిగిందంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

English summary
Hitting out at Bollywood star Aamir Khan for his remarks on intolerance, Union minister Prakash Javadekar on Wednesday said the "extreme reaction" given by the prominent actor has not only "dented" the image of the country but also his own.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X