వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

1971 యుద్ధం గుర్తుందిగా: పాకిస్తాన్‌పై వెంకయ్య ఆగ్రహం

పాకిస్తాన్‍‌పై ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడు ఆదివారం నిప్పులు చెరిగారు. పాకిస్థాన్ తన ప్రభుత్వ విధానంగా ఉగ్రవాదాన్ని మార్చుకుందని విమర్శించారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాకిస్తాన్‍‌పై ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడు ఆదివారం నిప్పులు చెరిగారు. పాకిస్థాన్ తన ప్రభుత్వ విధానంగా ఉగ్రవాదాన్ని మార్చుకుందని విమర్శించారు.

ఆయన కార్గిల్ పరాక్రమ పరేడ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్న పాకిస్థాన్ 1971లో జరిగిన యుద్ధంలో ఘోరంగా ఓడిపోయిన విషయం గుర్తుంచుకోవాలన్నారు.

ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా పాకిస్తాన్‌కు ఒరిగేదేమీ ఉండదన్నారు. భారత్‌లో కాశ్మీర్ భాగమని, వదలుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

షాకింగ్: మేడిన్ జర్మనీ పేరుతో భారత ఆయుధాల్లో చైనా నకిలీలుషాకింగ్: మేడిన్ జర్మనీ పేరుతో భారత ఆయుధాల్లో చైనా నకిలీలు

Abetting terror won't help, recall what happened in 1971: Naidu warns Pak

ఉగ్రవాదం మానవత్వానికి శత్రువు అని చెప్పారు. ఉగ్రవాదానికి మతం లేదని చెప్పారు. కానీ పాకిస్తాన్ మతాన్ని, ఉగ్రవాదాన్ని కలిపేస్తోందని ధ్వజమెత్తారు. దురదృష్టవశాత్తూ తీవ్రవాదం పాకిస్తాన్ పాలసీ అయిందన్నారు.

భారత్ శాంతి దేశమని, ఎవరి పైనా దాడి చేయదని, అది తమ ప్రత్యేకత అన్నారు. యుద్ధాని భారత్ కోరుకోదన్నారు. సరిహద్దు దేశాలతో తాము మంచి సంబంధాలను కోరుకుంటామన్నారు.

కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమన్నారు. పీవోకే భారత్‌దే అని, దానిని ఇంచు కూడా వదులుకోమని చెప్పారు. పాకిస్తాన్ తీవ్రవాదానికి నిధులు ఇచ్చి సహకరిస్తుందన్నారు.

English summary
Hitting out at Pakistan-sponsored terrorism, National Democratic Alliance (NDA) Vice-Presidential nominee M Venkaiah Naidu on Sunday asked Islamabad to recall the 1971 war and said that aiding and abetting terror will not help them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X