వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాంగ్ కాల్ జీవితాన్నే మార్చేసింది, ఏమైందంటే?

ఒక రాంగ్ కాల్ ఆమె జీవితాన్ని మార్చేసింది. విధి వంచితురాలుగా బాధపడుతున్న ఆమెకు ఆ రాంగ్ ఫోన్ కాల్ ఆమె జీవితంలో అద్భుతాన్ని సృష్టించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై:ఒక రాంగ్ కాల్ ఆమె జీవితాన్ని మార్చేసింది. విధి వంచితురాలుగా బాధపడుతున్న ఆమెకు ఆ రాంగ్ ఫోన్ కాల్ ఆమె జీవితంలో అద్భుతాన్ని సృష్టించింది.లలిత అనే యువతి జీవితాన్ని మలుపుతిప్పిన రాంగ్ ఫోన్ కాల్ గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరిని చదవాల్సిందే.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఆజంఘడ్ కు చెందిన లలితపై ఆమె సోదరుడే యాసిడ్ పోశాడు. చిన్న గొడవ కారణంగా లలితపై యాసిడ్ పోసి ఆయన తన కసిని తీర్చుకొన్నాడు.అయితే యాసిడ్ దాడికి గురైన లలితకు 17 శస్త్రచికిత్సలు చేశారు.

దీంతో ఆమె ముఖంలో మార్పులు వచ్చాయి. అయితే ఈ ఘటనతో ఆమె తన స్వంత ఊర్లో ఉండేందుకు ఇష్టపడలేదు. మహరాష్ట్రలోని సాహస్ పౌండేషన్ వద్ద ఆమె ఆశ్రయంపొందుతోంది.

Acid attack, 17 surgeries later, I found love: 26-year-old from Mumbai on her wedding day

ఈ పౌండేషన్ యాసిడ్ బాధితులకు ఆశ్రయం కల్పిస్తోంది.అయితే ఓ రోజు వచ్చిన రాంగ్ ఫోన్ కాల్ ఆమె జీవితాన్నే మార్చేసింది.ఈ ఫోన్ కాల్ ద్వారా ఆమెకు రవిశంకర్ పరిచయమయ్యాడు. కొద్దిరోజులకే ఒకరినొకరు కలుసుకొన్నారు.

రవిశంకర్ ముంబైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో సీసీటీవి ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. అతని కుటుంబానికి రాంచీ లో ఓ పెట్రోల్ బంక్ కూడఉంది. పరిచయమైన తొలినాళ్ళనుండే లలితను ప్రేమించిన రవిశంకర్ పెళ్ళి ప్రతిపాదన చేశాడు.

అయితే ఈ ప్రతిపాదనను ఆమె కాదనలేకపోయింది.మంగళవారం నాడు వారిద్దరూ థానే కోర్టులో చట్టబద్దంగా వివాహం చేసుకొన్నారు. అద్బుతాలు జరుగుతాయనే మాట తన నిజజీవితంలో నిజమైందని లలిత ముంబైలో నిర్వహించిన రిసెప్షన్ లో ఏడుస్తూ చెప్పింది.

అయితే ఈ వివాహనికి సంబందించిన విషయాన్ని తన తల్లికి చెప్పాల్సి ఉందన్నారు.పెళ్ళి తర్వాత రాంచీకి వెళ్ళాలా, ముంబైలో ఉండాలా అనేది లలిత ఇష్టమని రవిశంకర్ ప్రకటించారు.

సాహస్ పౌండేషన్ లలిత లాంటి యాసిడ్ బాధితులు మరో 21 మందికి ఆశ్రయం కల్పిస్తోంది. ఇటీవల ఈ ఆశ్రమాన్ని సందర్శించిన బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ లలితకు అవసరమైన శస్త్రచికిత్సలకు సహాయం చేస్తానని హమీ ఇచ్చారు.

English summary
“Miracles do happen,” says Lalita Ben Bansi, 26, as she gets ready for her wedding reception in Mumbai on Tuesday. “Who would have thought an acid attack and 17 surgeries later I would find love. But it happened. And it all started with a wrong number.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X