వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో మకాం వేసిన పళనిసామి, పన్నీర్ సెల్వం, రాజీ కోసం బీజేపీ పెద్దలు, కలిసి చెన్నైకి !

అన్నాడీఎంకే పార్టీలోని పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గాలు కలిసిపోవడానికి రంగం సిద్దం అయ్యింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఆ రాష్ట్ర మాజీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీలోని పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గాలు కలిసిపోవడానికి రంగం సిద్దం అయ్యింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఢిల్లీలో మకాం వేసి రాజీ కావడానికి సిద్దం అయ్యారని తెలిసింది.

నాతో పెట్టుకోవద్దు, సీఎం పళనిసామికి వార్నింగ్ ఇచ్చిన శశికళ అక్క కొడుకు, పదవిలో ఉండవునాతో పెట్టుకోవద్దు, సీఎం పళనిసామికి వార్నింగ్ ఇచ్చిన శశికళ అక్క కొడుకు, పదవిలో ఉండవు

ఢిల్లీలోని బీజేపీ పెద్దలు ఇరు వర్గాలను రాజీ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ఉప రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన ఎం. వెంకయ్యనాయుడిని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అభినందించారు.

Action shifts to New Delhi as Palanisamy, Panneerselvam reach capital

బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలు తమిళసై సౌందరరాజన్ సైతం ఢిల్లీలో ఉన్నారు. ఎయిర్ పోర్టులో తమిళసై సౌందరాజన్ మీడియాతో మాట్లాడుతూ అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు త్వరలోనే కలిసిపోతాయని, తమిళనాడులో ప్రభుత్వం స్థిరంగానే ఉంటుందని చెప్పారు.

వెంటనే మంత్రి పదవులకు రాజీనామా చెయ్యండి: టీటీవీ దినకరన్ వర్గం సవాల్ !వెంటనే మంత్రి పదవులకు రాజీనామా చెయ్యండి: టీటీవీ దినకరన్ వర్గం సవాల్ !

ఇప్పటికే టీటీవీ దినకరన్ ను అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించిన ఎడప్పాడి పళనిసామి వీలినం చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదే సమయంలో పన్నీర్ సెల్వం మాట్లాడుతూ ఇక ముందు తమిళనాడు ప్రజలకు అంతా మంచి జరుగుతుందని అన్నారు. మొత్తం మీద ఢిల్లీలో ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం కలిసిపోయి చెన్నై చేరుకుంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

English summary
All eyes of Tamil Nadu politics are on New Delhi, as chief minister Edappadi K Palaniswami and former CM O Panneerselvam, the leaders of the two warring factions of the AIADMK.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X