వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వాతంత్య్రం మేమే తెచ్చాం: మరో వివాదంలో రమ్య

|
Google Oneindia TeluguNews

మాండ్యా: సినీ నటి, కాంగ్రెస్ మాజీ పార్లమెంటుసభ్యురాలు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు. ఈసారి భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్‌లను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. మంగళవారం మాండ్యాలో భారత రాష్ట్రీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు.

ర్యాలీలో రమ్య

ర్యాలీలో రమ్య

ఈ సందర్భంగా రమ్య మాట్లాడుతూ.. బిజెపి, ఆర్ఎస్ఎస్‌ల దేశానికి స్వాతంత్ర్యం లభించలేదని కేవలం కాంగ్రెస్ పార్టీ పోరాటాల వల్లే వచ్చిందని అన్నారు. నాడు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తుంటే ఆర్ఎస్ఎస్, బిజెపిలు ఆంగ్రేయులతో కలిసి పోయాయని ఆరోపించారు.

రమ్య

రమ్య

జయచామరాజేంద్ర ఒడయార్ సర్కిల్ నుంచి సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సర్కిల్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో విద్యార్థులతో కలిసి 3,500 అడుగుల పొడవైన జాతీయ జెండా ప్రదర్శించారు.

రమ్యతో సెల్ఫీలకు పోటీ

రమ్యతో సెల్ఫీలకు పోటీ

ఎన్ఎస్‌యూఐ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రమ్యను చూసేందుకు, ఆమెను సెల్ఫీలు దిగేందుకు విద్యార్థులు పోటీపడ్డారు.

వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో రమ్య

వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో రమ్య

ఇది ఇలా ఉండగా, ఇటీవల పాకిస్థాన్‌లో పర్యటించిన అనంతరం రమ్య మాట్లాడుతూ.. పాకిస్థాన్ నరకం కాదని, అక్కడ తమను బాగా చూసుకున్నారని రమ్య తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఆమెపై పలువురు విమర్శల వర్షం కురిపించారు. తాజా వ్యాఖ్యలతో రమ్య మరోసారి వివాదంలో చిక్కుకున్నట్లయింది.

English summary
Controversy could well be the middle name of actress-politician, Ramya, as she stoked another row on Tuesday—third in as many weeks—when she said leaders of BJP-RSS were not part of the freedom movement but joined hands with the British.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X