వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యోగి ఆదిత్యనాథ్ ప్రణాళికకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రణాళికలకు సుప్రీం కోర్టు పచ్చ జెండా ఊపింది. భారత దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఉత్తర ప్రదేశ్‌లో శాంతిభద్రతలు కాపాడేందుకు లక్షకు పోగా పోలీసు పోస్టులను భర్తీ

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రణాళికలకు సుప్రీం కోర్టు పచ్చ జెండా ఊపింది. భారత దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఉత్తర ప్రదేశ్‌లో శాంతిభద్రతలు కాపాడేందుకు లక్షకు పోగా పోలీసు పోస్టులను భర్తీ చేయాలన్న యోగి ఆలోచనలకు సుప్రీం ఆమోద ముద్ర వేసింది.

గొప్పలు సరే..: యోగి పాలనపై 'ఉత్తర ప్రదేశ్' ఏమంటోంది?గొప్పలు సరే..: యోగి పాలనపై 'ఉత్తర ప్రదేశ్' ఏమంటోంది?

దాదాపు నెల రోజుల క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ ప్రతి యేడా సుమారు 33 వేల మంది కానిస్టేబుళ్లను నియమించడం ద్వారా 2012 నాటికి రాష్ట్రంలో మొత్తం పోలీసు ఖాళీలన్నింటిని భర్తీ చేయాలని యోచిస్తున్నారు.

సుప్రీం కోర్టు ఓకే

సుప్రీం కోర్టు ఓకే

దీనికి సుప్రీం కోర్టు ఒకే చెప్పింది. నియామకాలు ఆలస్యమైతే రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి లేదా అత్యంత సీనియర్ అధికారినే తప్పుబట్టాల్సి వస్తుందని కూడా సుప్రీం తేల్చి చెప్పింది.

అయిదు రాష్ట్రాల్లో ఖాళీ

అయిదు రాష్ట్రాల్లో ఖాళీ

వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న సుమారు 5.52 లక్షల పోలీస్ పోస్టులను అత్యవసరంగా భర్తీ చేయాలని సుప్రీం కోర్టు గతవారం తెలిపింది. యూపీలో అన్నింటికంటే ఎక్కువగా 1.5 లక్షల పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

యూపీలోనే పెద్ద మొత్తంలో ఖాళీలు

యూపీలోనే పెద్ద మొత్తంలో ఖాళీలు

అక్కడ మొత్తం 3.5 లక్షల మంది కానిస్టేబుళ్లు, ఇతర పోలీసు అధికారుల పోస్టులు మంజూరై ఉన్నాయి. దేశంలో పోలీసు విభాగంలో ఖాళీలను భర్తీ చేయించాలని 2013లో ఒక ప్రజాహితవ్యాజ్యం నమోదయింది. ఈ విచారణ సందర్భంగా యోగి ప్రణాళికలకు సుప్రీం ఆమోదం తెలిపింది.

బయోమెట్రిక్

బయోమెట్రిక్

ఇదిలా ఉండగా, యూపీలో యూపీలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో బయోమెట్రిక్ ఉపయోగించాలని యోగి ఆదేశాలు జారీ చేశారు. బ్లాక్ లెవల్ వరకు బయోమెట్రిక్ ఉపయోగించాలన్నారు.

English summary
The Supreme Court on Monday approved the Yogi Adityanath government’s roadmap to fill over 1.5 lakh vacant posts in police department of Uttar Pradesh in four years, saying it would help improve law and order situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X