వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ రావాలని విపక్షాల ఆందోళన: ఉభయసభల్లో గందరగోళం

పెద్దనోట్ల రద్దుపై పార్లమెంటు ఉభయసభల్లోనూ మంగళవారం కూడా విపక్షాల ఆందోళన కొనసాగుతోంది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దుపై పార్లమెంటు ఉభయసభల్లోనూ మంగళవారం కూడా విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఈ అంశంపై చర్చ చేపట్టాలని.. ప్రధాని మోడీ చర్చలో పాల్గొనాలని డిమాండ్‌ చేశారు.

Adjourn resume adjourn repeat in Lok Sabha, Rajya Sabha on 10th day of Winter Session

ఛైర్మన్‌ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేస్తున్నారు. దీనిపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. బిజెపి పార్లమెంటరీ సమావేశం కొనసాగుతున్నందున ప్రధాని ఇప్పుడు రాలేదని, చర్చ ప్రారంభిస్తే ప్రధాని మధ్యలో హాజరవుతారని తెలిపారు.

అయితే, ఆయన మాటను వినకుండా విపక్షాలు వినకుండా నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. లోక్‌సభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. విపక్ష సభ్యుల ఆందోళన మధ్యే స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. నినాదాలతో సభలో గందరగోళం నెలకొనడంతో సభను వాయిదా వేశారు.

English summary
Demonetisation has been the reason for Parliament washouts over ten days now since Winter Session began on 16 November. Interestingly, Parliament has not discussed anything else except note ban imposed by the Narendra Modi government since the Winter Session began.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X