వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి మెడ మీద కత్తి: రాత్రికి రాత్రే మార్చేసిన పళనిసామి ప్రభుత్వం: టీటీవీ దెబ్బా !

తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ స్నేహితుడు సుబ్రమణియన్ అనుమానాస్పద మృతి కేసు రోజుకోక మలుపుతిరుగుతోంది. తాజాగా సుబ్రమణియన్ కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారులను తప్పించి మరో పోలీసు అధికారికి

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ స్నేహితుడు సుబ్రమణ్యం అలియాస్ సుబ్రమణియన్ (52) అనుమానాస్పద మృతి కేసు రోజుకోక మలుపుతిరుగుతోంది. మంత్రి విజయభాస్కర్ స్నేహితుడు సుబ్రమణియన్ మృతిపై న్యాయవిచారణ జరిపించాలని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ డిమాండ్ చేస్తున్నారు.

కొడనాడు ఎస్టేట్ జయ, శశికళ గదుల్లో రూ. 900 కోట్లు ? ఐటీ అధికారుల సోదాలు !కొడనాడు ఎస్టేట్ జయ, శశికళ గదుల్లో రూ. 900 కోట్లు ? ఐటీ అధికారుల సోదాలు !

అయితే తమిళనాడు ప్రభుత్వం పెద్దలు మాత్రం అదో చిన్న కేసు అనే రీతిలో ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా సుబ్రమణియన్ కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారులను తప్పించారు. మరో పోలీసు అధికారికి కేసు విచారణ బాధ్యతలు అప్పగించడంతో తమిళనాడు ప్రజలు ఉలిక్కిపడ్డారు.

టీటీవీ దెబ్బతోనే ఇన్ని సమస్యలు

టీటీవీ దెబ్బతోనే ఇన్ని సమస్యలు

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీకి దిగిన టీటీవీ దినకరన్ కు ఓట్లు వెయ్యాలని స్థానిక ఓటర్లకు భారీ మొత్తంలో నగదు పంపిణి చేస్తున్నారని చెవిన పడటంతో ఆదాయపన్ను శాఖ అధికారులు రంగంలోకి దిగారు. మంత్రి విజయభాస్కర్ తో పాటు ఆయన సన్నిహితులు, బంధువులకు చెందిన 35 ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు.

శరత్ కుమార్, రాధిక, రమ్య విచారణ

శరత్ కుమార్, రాధిక, రమ్య విచారణ

ఆదాయపన్ను శాఖ అధికారులు విజయ్ భాస్కర్ తో సహ ఆయన భార్య రమ్య, సమతువ మక్కల్ కచ్చి పార్టీ అధ్యక్షుడు, నటుడు శరత్ కుమార్, ఆయన భార్య, నటి రాధికను విచారించారు. ఇప్పటికే శరత్ కుమార్ ను మూడు సార్లు ఐటీ శాఖ అధికారులు విచారించి వివరాలు సేకరించారు.

రమ్య నిర్మిస్తున్న కాలేజీలో

రమ్య నిర్మిస్తున్న కాలేజీలో

విజయభాస్కర్ అక్రమాస్తుల కేసులోనే ఆయన స్నేహితుడు, ప్రముఖ కాంట్రాక్టర్ సుబ్రమణియన్ ను రెండు సార్లు విచారించారు. మంత్రి సతీమణి రమ్య నిర్మిస్తున్న కాలేజీ భవన నిర్మాణం విషయంలో అనేక ప్రశ్నలు వెయ్యడంతో సుబ్రమణియన్ ఉక్కిరిబిక్కిరి అయ్యారని వెలుగు చూసింది.

నాకు సంబంధం లేదని చెప్పినా ?

నాకు సంబంధం లేదని చెప్పినా ?

మంత్రి సతీమణి రమ్య నిర్మిస్తున్న కాలేజీకి తనకు ఎలాంటి సంబంధం లేదని సుబ్రమణియన్ చేసిన వాదనతో ఆదాయపన్ను శాఖ అధికారులు ఏకీభవించలేదని తెలిసింది. మే 9వ తేదీన మళ్లీ విచారణకు హాజరుకావాలని సుబ్రమణియన్ కు అధికారులు సూచించారని సమాచారం.

ఒక్క రోజు ముందే

ఒక్క రోజు ముందే

ఆదాయపన్ను శాఖ అధికారులు ముందు హాజరుకావాలసిన ఒక్క రోజు ముందే (మే 8వ తేదీ సోమవారం) నామక్కల్ జిల్లాలోని సేవిట్టు రంగంబట్టిలోని తన తోటలో సుబ్రమణియన్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఆయన పురుగుల మందు (విషం) సేవించడం వలనే మృతి చెందాడని వైద్యులు నివేదిక ఇచ్చారు.

డెత్ నోట్ మాయం అయ్యిందా ? లేదా

డెత్ నోట్ మాయం అయ్యిందా ? లేదా

సుబ్రమణియన్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. అయితే మొదట ఆయన డెత్ నోట్ ను బంధువులకు పంపించాడని అధికారులు గుర్తించారు. డెత్ నోట్ లో తనకు మంత్రి విజయభాస్కర్ ఆస్తులకు ఎలాంటి సంబంధం లేదని సుబ్రమణియన్ వివరించాడని ప్రచారం జరుగుతోంది.

రాత్రికి రాత్రి అధికారిని మార్చేశారు

రాత్రికి రాత్రి అధికారిని మార్చేశారు

మంత్రి స్నేహితుడు సుబ్రమణియన్ అనుమానాస్పద మృతి కేసు విచారణ మొదట ఇన్స్ పెక్టర్ ఇలంగో మొదలు పెట్టారు. అయితే గురువారం ఉదయానికి జిల్లా ఎస్పీ ఇన్స్ పెక్టర్ ఇలంగోను కేసు విచారణ నుంచి తప్పించి బదిలీ చేశారు. ఏడీఎస్పీ సెంథిల్ కు కేసు విచారణ బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఈ చెడ్డ పేరు తమిళనాడు ప్రభుత్వానికి చుట్టుకుంది.

English summary
A close aide of Tamil Nadu health minister Vijay Bhaskar was found dead in Namakkal district on Monday. Salem District SP has removed investigation officer inspector Elango.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X