బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎయిర్ షోలో తప్పిన ప్రమాదం: తాక్కుంటూ వెళ్లిన విమానాలు(వీడియో)

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు వేదికగా జరుగుతున్న ఎయిర్‌షోలో తృటిలో ప్రమాదం తప్పింది. విన్యాసాల సమయంలో రెడ్‌బుల్‌ విమానాల మధ్య రాపిడి జరిగింది. దీంతో రెక్కలు విరిగి, టైర్‌ ఊడటంతో విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అయింది.

విమానాన్ని పైలట్‌ సురక్షితంగా కిందకు దించాడు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. రాపిడి గురైన ఓ విమానంలో ఓ మహిళ పైలట్ ఉన్నట్లు తెలిసింది. కాగా, బెంగళూరులోని యలహంక వైమానిక స్థావరంలో పదో అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన 'ఏరో ఇండియా 2015'ను ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించారు. ఈ వైమానిక ప్రదర్శన ఐదురోజుల పాటు కొనసాగుతుంది. రక్షణ రంగానికి అవసరమైన నైపుణ్యం, మానవ వనరుల సృష్టికి విశ్వవిద్యాలయాల్ని ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.

ప్రదర్శన ప్రారంభం సందర్భంగా ప్రధాని వైమానిక రంగానికి చెందిన దేశ, విదేశీ ప్రతినిధుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ''వచ్చే పదేళ్ల వ్యవధిలో వైమానిక రంగానికి మాత్రమే రెండు లక్షల మంది సిబ్బంది, నిపుణులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు అవసరం. అణువిద్యుత్తు, రోదసి రంగాల కోసం ప్రారంభించిన విశ్వవిద్యాలయాల మాదిరే రక్షణ రంగం కోసం నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు, విశ్వవిద్యాలయాల్ని ప్రారంభిస్తాం'' అని మోడీ వెల్లడించారు.

రెడ్‌బుల్ విమానం

రెడ్‌బుల్ విమానం

బెంగళూరు వేదికగా జరుగుతున్న ఎయిర్‌షోలో తృటిలో ప్రమాదం తప్పింది. విన్యాసాల సమయంలో రెడ్‌బుల్‌ విమానాల మధ్య రాపిడి జరిగింది.

రెడ్‌బుల్ విమానం

రెడ్‌బుల్ విమానం

దీంతో రెక్కలు విరిగి, టైర్‌ ఊడటంతో విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అయింది.

రెడ్‌బుల్ విమానం

రెడ్‌బుల్ విమానం

విమానాన్ని పైలట్‌ సురక్షితంగా కిందకు దించాడు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. రాపిడి గురైన ఓ విమానంలో ఓ మహిళ పైలట్ ఉన్నట్లు తెలిసింది.

రెడ్‌బుల్ విమానం

రెడ్‌బుల్ విమానం

బెంగళూరు వేదికగా జరుగుతున్న ఎయిర్‌షోలో తృటిలో ప్రమాదం తప్పింది. విన్యాసాల సమయంలో రెడ్‌బుల్‌ విమానాల మధ్య రాపిడి జరిగింది.

రెడ్‌బుల్ విమానం

రెడ్‌బుల్ విమానం

విమానాన్ని పైలట్‌ సురక్షితంగా కిందకు దించాడు. దీంతో రెక్కలు విరిగి, టైర్‌ ఊడటంతో విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అయింది.

English summary
Two planes scraped each other today during a flight display at the Aerospace Show in Bengaluru. The planes landed safely and nobody was injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X