బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పాక్‌పై వ్యాఖ్యలు: సినీ నటి రమ్య కారుపై కోడిగుడ్లతో దాడి

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసినందుకు గాను కన్నడ నటి, కాంగ్రెస్ నేత రమ్యపై గురువారం దాడి జరిగింది. గురువారం ఆమె ప్రయాణిస్తున్న కారుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడి చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని మంగుళూరులో చోటు చేసుకుంది.

పాక్‌పై వ్యాఖ్యలు: క్షమాపణ చెప్పేది లేదన్న రమ్యపాక్‌పై వ్యాఖ్యలు: క్షమాపణ చెప్పేది లేదన్న రమ్య

వివరాల్లోకి వెళితే... మంగళూరులో స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమానికి హజరై తిరిగి విమానాశ్రయానికి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. ఈ దాడి ఘటనపై రమ్య మాట్లాడుతూ మంగుళూరులో తనపై గుడ్ల దాడి జరిగిందని అన్నారు. నల్లజెండాలతో కూడా స్వాగతం పలికారని, అయినప్పటికీ పాకిస్థాన్‌పై తాను చేసిన వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నానని, వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని ఆమె వ్యాఖ్యానించారు.

అయితే తనపై దాడి చేసింది ఎవరో తనకు తెలియదని ఆమె పేర్కొన్నారు. ఇటీవల పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన సార్క్‌ దేశాల యువ పార్లమెంటేరియన్ల సమావేశానికి రమ్య హాజరయ్యారు. తిరిగి భారత్‌కు చేరుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ.. 'కొందరు అన్నట్లుగా పాకిస్థాన్‌ నరకమేమీ కాదు. అక్కడి ప్రజలంతా మనలాంటివారే. మమ్మల్ని వారు ఎంతో బాగా చూసుకున్నారు' అని వ్యాఖ్యానించారు.

 After Accusations Of Sedition, Ramya Targeted With Eggs In Karnataka

మాజీ ఎంపీ, నటి రమ్యపై 'దేశద్రోహం'కేసుమాజీ ఎంపీ, నటి రమ్యపై 'దేశద్రోహం'కేసు

పాకిస్తాన్‌కు అనుకూలంగా రమ్య చేసిన ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఆమెపై దేశద్రోహం కేసు కూడా నమోదైంది. పాకిస్తాన్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన రమ్యపై సెక్షన్ 124/ఎ, 334ల కింద కొడగు జిల్లా సోమవార పేటలోని జేఎంఎఫ్‌సీ కోర్టులో ప్రైవేటుగా దేశద్రోహం కేసు దాఖలైంది.

పాకిస్థాన్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పబోనని రమ్య కూడా గట్టి పట్టుదలతోనే ఉన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తన సొంత అభిప్రాయాలను మాత్రమే చెప్పానని తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో సొంత అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు అందరికీ ఉంటుందన్నారు.

English summary
After being named in a sedition complaint this week, actor-turned-politician Ramya was in Mangalore today when protestors surrounded her car and eggs were thrown at it. She was escorted by the police away from airport to attend a local event.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X